ఆడజన్మ కెందులకో
బంధనముల బాధలన్ని
ఆమెకేల వేదనలా
చాకిరీల బాధలన్ని
పుట్టినిల్లు విడచినంత
మెట్టినింట అగచాట్లు
నిద్రలేక తిండిలేక
వేధింపుల బాధలన్ని
కట్నాలని కానుకలని
వెర్రిగాను కోరుతారు
ఆపైఇక ఆగవుగా
సాధింపుల బాధలన్ని
త్యాగమూర్తి శాంతమూర్తి
బిరుదులతో ఏమార్చును
కడతేర్చే కసాయోళ్ళ
మోసముల బాధలన్ని
ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో
ఎందుకనో తెలుసుకోరు
స్త్రీ జాతికి తప్పవేల
ఆగడముల బాధలన్ని!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి