తల్లిని కాపాడిన పిల్లలు (సంయుక్త అక్షరాలు లేని కథ) డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
 ఒక అడవిలో ఒక మేక వుండేది. దానికి చందమామల్లాంటి బుజ్జిబుజ్జి పిల్లలు వున్నాయి. ఒకరోజు అవన్నీ కలసి మేతకు పోయాయి. అడవంటే మాటలు కాదు గదా... ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి మీద పడతాయో తెలీదు. ఆ అడవిలో ఒక నక్క వుంది. దాని కన్ను మేక మీద పడింది. ''ఆహా! దొరికిందిరా పసందైన విందు భోజనం'' అనుకుంటా ఎగిరి దాని మీదకు దుంకింది. తల్లీపిల్లలు బెదిరిపోయి తలోదిక్కు పరుగు అందుకున్నాయి. ''ఈ చిన్న చిన్న పిల్లలు నాకెందుకు. ఎన్ని తిన్నా కడుపులో ఒక మూలకు గూడా సరిపోవు. పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి. నాలుగు రోజులు కమ్మగా కాలు మీద కాలేసుకోని తినొచ్చు'' అనుకొని దాని వెంట పడింది. అది బెదపడి మరింత వేగంగా వురకసాగింది. దారిలో ఒకచోట ఒక పెద్ద గుంత వుంది. మేక అది చూసుకోలేదు. సక్కగా పోయి దభీమని దానిలో పడిపోయింది. ఆ గుంత చానా లోతుగా వుంది. నక్క వురుక్కుంటా ఆ గోతి కాడికి వచ్చింది. కింద అందేంత దూరంలోనే ఆహారం వుంది. కానీ దిగితె పైకి రావడం అంత సులభం గాదు. ''ఆశకు పోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం. అడవేం చిన్నది గాదు. ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది'' అనుకుంటా గమ్మున తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ మేకపిల్లలన్నీ తలా ఒక దిక్కు పారిపోయాయి గదా... అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఒక చోటికి గుంపయ్యాయి. అమ్మను వెదుక్కుంటా బైలుదేరాయి.
అలావెదుకుతా వెదుకుతా చివరికి ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి. అప్పటికే ఆ మేక బైటకి రావడానికి ఎగిరీ ఎగిరీ అలసిపోయి, ఇంగ లాభం లేదు అనుకోని మౌనంగా వుండిపోయింది. పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... అమ్మా...'' అంటా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి. పిల్లలని చూసి తల్లికి గూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాసేపటికి అది తేరుకోని ''పిల్లలూ... చీకటి పడతా వుంది. మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇక ఈ రోజుతో మీకూ నాకూ ఋణం తీరిపోయింది. మీరంతా హాయిగా కలసి మెలసి వుండండి. అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడకండి'' అంటా మంచిమాటలు చెప్పింది. ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ''అమ్మా... నీతో బాటు మేమూ ఇక్కడే వుంటాం. చావయినా బతుకయినా నీతోనే. నిన్ను వదలి ఎక్కడికీ వెళ్ళం'' అన్నాయి. అప్పుడు ఒక చిట్టిమేక ''మనం ఇలా గంటలు గంటలు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏం లాభం లేదు. చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి. వుత్తమాటలతో, కళ్ళనీళ్ళతో పనులు గావు. బుర్రలకు పదును పెట్టండి. సమయం చాలా తక్కువగా వుంది'' అనింది. అన్నీ ఆలోచనలో పడ్డాయి. కాసేపటికి ఒక బుజ్జిమేక ఆనందంగా ''అన్నలారా... అదిగో అక్కడ చూడండి. ఒక పెద్ద తీగ లావుగా బలంగా వుంది. దాన్ని తెంపి లోపలికి వదులుదాం. అమ్మను పైకి లాగుదాం. ఎలా వుంది నా ఆలోచన'' అంది. ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది. వెంటనే పరుగెత్తుకోని పోయి ఆ తీగను నోటితో కొరికి తెంపాయి. దాన్ని మోసుకోని వచ్చి లోపలికి వదిలాయి. ''అమ్మా... నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో. మేమంతా మరొక వైపు పట్టుకొని పైకి లాగుతాం. ఏం సరేనా'' అన్నాయి సంబరంగా. పిల్లల తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి 'సరే' అంది. ఆ తీగను గట్టిగా పట్టుకొంది. రెండవ వైపు పిల్లలన్నీ కలసి పట్టుకొని ''లాగర లాగు హైలెస్సా... గట్టిగ లాగు హైలెస్సా... అందరు కలసి హైలెస్సా... అమ్మను లాగు హైలెస్సా'' అని అరుచుకుంటా లాగసాగాయి. కానీ అవెంత. వాటి బలమెంత. బుజ్జి బుజ్జి పిల్లలు. ఎంత లాగినా తల్లి ఒక్క ఇంచు గూడా పైకి రాలేదు. లాగీలాగీ వాటి పళ్ళు నొప్పి పెట్టాయి. చేతగాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అన్నీ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... మేం ఓడిపోయాం. నిన్ను కాపాడుకోలేక పోతా వున్నాం'' అన్నాయి దిగులుగా. అంతలో ఒక చిట్టిమేకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ''తమ్ముల్లారా... మనమంటే చిన్న చిన్న పిల్లలం. బలం తక్కువ. అమ్మను బైటకు లాగలేక పోతా వున్నాం. అదే అమ్మయితే మనలని గుంతలో నుండి ఒక్క నిమిషంలో బైటకు లాగగలుగుతుంది'' అంది. మిగతావి తల గోక్కుంటా ''నిజమే... నువ్వు చెప్పేది. కానీ గుంతలో వున్నది అమ్మగానీ మనం కాదు గదా'' అన్నాయి. అప్పుడు ఆ చిట్టిమేక చిరునవ్వు నవ్వుతా ''అన్నలారా... మనం అందరం గుంతలోకి దుంకేద్దాం. మన మీదకు ఎక్కి అమ్మ బైటకు ఎగురుతుంది. ఆ తరువాత మరలా మనందరినీ ఒక్కొక్కటిగా పైకి లాగుతుంది. ఏమంటారు'' అంది. అన్నింటికీ ఆ ఆలోచన తెగ నచ్చేసింది. వెంటనే ''అమ్మా'' అంటా ఒక్కొక్కటి లోపలికి దుంకేశాయి. పిల్లలు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. తల్లిమేక వాటిపైకి ఎక్కి ఎగిరి గట్టు మీదకు చేరుకుంది. తరువాత ఒక్కొక్కదాన్ని తీగతో పైకి లాగేసింది. ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనను కాపాడిన పిల్లలకు కోరినవన్నీ చేసిపెట్టి గొప్ప విందు ఇచ్చింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం