మన రంగుల హోలీ;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మన హోలీ సంబరం
తాకాలిక అంబరం
ప్రకృతి సుందరం
వేడుక అగు మధురం !

రంగులు రంగులు రంగులు
ఇంట్లోన పాల పొంగులు
చేస్తారు పిండి వంటలు
తీసేస్తారుగ అంటలు !

హోలీ హోలీ పండుగ
చేయాలి మనం నిండుగ
ఆనందం ఇక మెండుగ
కల్గు మదిలోన దండిగ !

రంగుల మాయం జీవితం
అవుతుంది ప్రభావితం
హోలీ ఇచ్చు సంకేతం
తెలిసిందా నవనీతం !

ప్రతి ఏడూ వస్తుంది
ప్రకృతి పండుగ ఇది
వసంతాన్ని తెస్తుంది
రంగుల వల వేస్తుంది !

పలు రకాల రంగులు
నింపి ఉన్న బుంగలు
పై నిలువు నామాలు
ప్రదర్శించు వన్నెలు !

ఎటు చూసినా రంగులే
వరుణ్ శోభిత పొంగులే
పొర్లి పొంగిన హంగులే
ఉన్న కేశాల రింగులు !

పూల రంగులు వాడాలి
హోలీ పాటలు పాడాలి
మిత్రుల దరి చేరాలి
సయ్యాటలే ఆడాలి !

చందాల వసూలు వద్దు
బృందాల ఆటలు ముద్దు
ఒంటరి పోరు ఇక రద్దు
ఐకమత్యం వచ్చుటకద్దు !

హోలీ పండుగ ఇక జరుపు
ఇవ్వు అందరికీ పిలుపు
శుభాకాంక్షలను తెలుపు
సాంప్రదాయమును నిలుపు !

రసాయన రంగులను
వాడొద్దు ఎవ్వరును
మన కళ్ళు పాడగును
చర్మవ్యాధి వచ్చేను!

మందు తాగి ఆడొద్దు
మత్తులో ఇక పడొద్దు
పాడినచో చెడుట కద్దు
చిందులు అసలే వద్దు !

హోలి మంటలు వేయి
చెడును కాల్చివేయి
కేరింతలు వద్దోయి
వేడుక చేయవోయి !


కామెంట్‌లు