జీవమెక్కడ...?; -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 భౌతిక శాస్త్రం ప్రకారం  మానవ శరీరం  తల్లి గర్భంలో రూపు దిద్దుకుంటుంది. బుడగతో ప్రారంభమై 9 నెలల తరువాత  పూర్తి మానవ ఆకారం వచ్చిన వెంటనే  తల్లి గర్భం నుంచి ఆ బిడ్డ ఈ భూమి మీదకు వస్తుంది. దిన దిన ప్రవర్ధ మానమై  వయస్సు పెరిగి  శరీరం యవ్వన స్థితికి వచ్చిన తరువాత  జ్ఞాన సంపన్నుడై  ఈ శరీరం ఎలా నడుస్తోంది  ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం. ఒకరు చెప్పిన దానికి సమాధానం చెప్పడం అన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి. దాని సృష్టికి మూలం  ఏమిటి అన్న ఆలోచన ప్రారంభమైనప్పుడు  ఈ తనువులో శరీరంతో కలిసి  నడవడానికి కారణం లోపల జీవం అని గమనించి  జీవి తనువు  కలిస్తేనే ఈ మానవ శరీరానికి కదలికలు ఉన్నాయి అన్న విషయాన్ని  అర్థం చేసుకుంటాడు.
ఈ శరీరాన్ని నడపడానికి  జీవం ఉపయోగపడినట్టుగా  ఆ జీవి ఎక్కడి నుంచి వస్తుంది  మనం మాట్లాడ్డానికి కారణం ఎక్కడ ప్రారంభమవుతుంది  అనేది తాను తెలుసుకోవడానికి ప్రయత్నం  చేసి ఎవరినైనా ఒక మేధావిని కలిసి తన మనసులోని మాట తెలియజేసి  సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ శరీరానికి ఉన్న  పంచేంద్రియములు కలిసి  5 పద్ధతులుగా ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి  దానికి ఆలోచనలను సృష్టించగలిగినది మనసు  మనసు ఈ శరీరంలో వెన్నుపూసగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు  ఏదైనా ఒక ప్రశ్న  వచ్చినప్పుడు దానికి సమాధానంగా వెన్నుపూస  అనేక సమాధానాలను ఇస్తుంది. ఒక్కొక్క దానిని తగ్గించుకుంటూ  చిన్న మెదడు  అనవసరమైన వాటిని తగ్గించి  మిగిలిన రెండు మూటిని  మెదడుకు అందజేస్తుంది
చివరిగా ఆ బుద్ధి ఏదైతే  నిర్ణయించిందో దానిని తప్పనిసరిగా అనుసరిస్తుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుంటారు.  ఒక కుటుంబంలో  భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఉన్నట్టుగా ఈ భావం, జీవం  లాంటివి కలిసి కాపురం చేయవు. దేని పని అది చేస్తూ  ఒక దాని నుంచి మరొక దానికి  పంపిస్తూ ఉండడమే దాని పని. ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నట్లైతే  వేరాంతాన్ని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు. శరీరంలో ఉన్న భాగాల మూల సూత్రాలను అధ్యయనం చేసి తెలుసుకోమంటారు ఏమన్నా  అది తెలుసుకున్న తర్వాత ఎలాంటి ఆలోచనలకు సందేహాలకు తావు ఉండదు  అంటూ తన ఆట వెరైటీ పద్యంలో  ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు  ఆ పద్యాన్ని మీరు ఒకసారి చదవండి.

"జీవ మేడ నుండు భావమెక్కడ నుండు కాపురంబు యేడ గదిసియుండు తనరుచున్న రెంటి స్థలమేల తెలియరు..."



కామెంట్‌లు