గుడ్డి ఎద్దు పద్ధతి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సహజంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే  ఎదురుగా ఎవరైనా వ్యక్తి కనిపించినప్పుడు  అతడు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత గొప్ప దానశీలి అయినా దేశానికి మంచి చేస్తున్న వ్యక్తి  అయినా  అతను ఎవరో అతని పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని కానీ  అది తెలుసుకున్న తర్వాత  వారి విషయం తెలిసి గౌరవించాలన్న పరిజ్ఞానం కాని మనకు ఉండదు  ఎవరి పని వారు చూసుకోవటంలో నిమగ్నం అయిపోతూ ఉంటారు  ఇవాళ లోకంలో  పని వేగం (స్పీడ్ వర్క్)  పెరిగింది. దాని మీద మనసు లగ్నం చేస్తాడు తప్ప మానవుడు  ఇతరుల విషయాలకు  వెళ్లడం అతనికి ఇష్టం ఉండదు  ఒకవేళ అతను అలా చేయాలని నిశ్చయించుకున్నా తన పనికి ఆటంకంగా ఉంటుందని  దానిని ప్రక్కన పెడతాడు. పరిణతి చెందడం కోసం  కొంతమంది మునులు ఋషులు  అడవి ప్రాంతాలను  ఎన్నుకొని ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడకు వెళ్లి  ఆ ప్రకృతి సౌందర్యాన్ని గమనిస్తూ  దానికి అనుగుణంగా తాను అనుకున్న పనిని తయారు చేయడానికి నిమగ్నమై ఉంటాడు  భారతీయులకు ఒక నమ్మకం  బ్రహ్మ మనలను పుట్టిస్తాడని  విష్ణువు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాడని  శివుడు ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని ఏర్పరచి  లయబద్ధంగా ఉంచుతాడని  ఆస్తికులు అందరూ నమ్మే విషయం  వీరులో ఎవరికి అటు బ్రహ్మ, ఇటు విష్ణువు చివరకు మహేశ్వరుని  ఆకారాలు కూడా తెలియదు  దాన్ని తెలుసుకోవడం కోసం గురువులను ఆశ్రయిస్తే  అతనికి కూడా తెలియక  ఏవేవో ఉపన్యాసాలు ఇస్తూ  వక్రమార్గాన్ని చూయిస్తాడు తప్ప ఏ స్వరూపం ఎలా ఉంటుంది  వారి ఎదురుగా కనిపించే వారిని ఎలా గుర్తుపట్టడం  అన్న విషయాలు ఆ దొంగ సాధువుకు అసలు తెలియదు  ప్రాథమిక విషయాలు తెలియని ఈ సాధకుడు  ఎదురుగా బ్రహ్మ కానీ విష్ణువు కానీ  సాక్షాత్కరించినా వారిని గుర్తు పట్టడం కానీ పాదాభివందనం చేయడం కానీ  చేయనంతటి అజ్ఞానంలో ఉంటాడు  కారణం గురువుకే తెలియదు కదా  ఇది ఎలా ఉంటుందంటే  గుడ్డి ఎద్దు జొన్న చేనులో పడి  దాని మేత మేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది  దానివల్ల ఆచరణ మొత్తం నాశనం అవ్వడం ఖాయం  కనుక అలాంటి దొంగ సాధవుల దగ్గరకు వెళ్లి విషయాన్ని అడగవద్దు  మనసును స్వాధీన పరచుకుని మీ అంతట మీరే  తపస్థితికి వెళ్లండి అని చెబుతున్నాడు వేమన  ఆ పద్యాన్ని చదవండి.

"శిష్య వర్గమునకు శివుజుపనేరక కాని మతములోన కలుపు నట్టి గురుని ఎరుక నరయ గుడ్డెద్దు
జోన్నరా..."


కామెంట్‌లు