మహిళా మహిళా మహిళా;- సి.హేమలత-పుంగనూరు-9666779103
మహిళా దినోత్సవం సందర్భంగా
=========================
 ప్రేమకు రూపం మహిళా 
ఇంటికి దీపం మహిళా 
జన్మకే జన్మనిచ్చు మహిళా
 జగతికే జీవం ఓ మహిళా
దారి చూపు దేవతగా 
ఇలకు నిన్ను పంపాడు 
తనలో సగభాగమిచ్చి
 అర్ధనారీషుడాయే శివుడు
!!ప్రేమ!!

 అనంత శక్తి రూపం మహిళా
 అపార భక్తి భావం మహిళా
 ధరణిలో ధాతృత్వం మహిళా
 బాధ్యతల బందీ ఓ మహిళా
స్వేచ్ఛ లేని జీవితాన 
చిరునవ్వే తనఆభరణం
  తరువుగా తరుణీ నిలబడి
 శిధిల సౌధాలను మార్చు భవనముగా
!! ప్రేమ!!

భరించే భూమాత మహిళా
ప్రవహించే జీవనది మహిళా
జాతికే జాగృతి మహిళా
 మనిషికి జీవరాగం ఓ మహిళా

 అమ్మ అత్తల ఇంటికి వారధి
 తనయుల భవితకు సారధి
 పువ్వుల సుకుమారం తనది
 హిమ పర్వత రక్షణేఆమె చూపుది

!! ప్రేమ!!


కామెంట్‌లు