"ఓం"కారమె నాదము! ;-శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 "ఓం"కారమె నాదము! 
        పరంబ్రహ్మ శబ్దము! 
        ఒక్కటే అక్షరము! 
                   ఓ తెలుగు యువత! 
        ( తెలుగు యువత పదాలు., శంకర ప్రియ., )
🪷"ఓం"కారమే ప్రణవము! ఒక్కటే అక్షరము! భవ తారక మంత్రము! సత్.. చిత్.. ఆనందమయమగు, పరంబ్రహ్మ స్వరూపము! శక్తివంతమైన పరమేశ్వర వాచకము! జగద్రక్షణ కవచము! 
🪷"ఓం"కారమే.. అనాదియగు నాదము! "అ"కార, "ఉ"కార, "మ"కారముల.. సంయోగము వలన ఏర్పడిన వర్ణము! "ఓం"కారములో... సృష్టి అంతయు, సూక్ష్మ రూపములో ఇమిడియున్నది! యని ఉపనిషత్తుల సందేశము! 
      🚩శార్దూల పద్యము 
     "ఓం"కారమ్మది నాదరూప భవమౌ, యోంకారమే నాదమై,
     "ఓo"కార శ్రవణంబు మోదకరమై, యోగ్యంబె భాసిల్ల, గాన
      "ఓo"కారంబగు నాదమే ప్రణవమౌ, నుత్కర్ష భాషాంబయౌ
      "ఓoకార మ్మి

క మూలమౌ నుడులకే! యోమే జగద్రక్షయౌ!! 
      ( రచన: కొరిడె విశ్వనాథ శర్మ.,)
కామెంట్‌లు