🔆పరం బ్రహ్మ రూపము
"దీపము" జ్వలిoచుటకు
కావలె "అగ్గి పెట్టె"!
ఆత్మ బంధువు లార!
🔆అత్యవసర మైనది
ఉపయుక్త మైనదీ
"అగ్గి పెట్టె" ప్రజలకు!
ఆత్మ బంధువు లార!
(ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ,, )
👌అగ్గి పెట్టె.. బహుళ ప్రయోజనకర మైనది! గృహస్థులకు అత్యవసర మైనది! ఎందువలన అనగా... పూజా మందిర మందు, దీపం గాని.. ధూపం గాని.. హారతి గాని.. వెలిగించడానికి... ఉపయోగబడేది... "అగ్గి పెట్టె"! అరయగా, ఆకలి అనే శత్రువుల పాలిట, పదునైన కత్తి... "అగ్గి పెట్టె"! అనగా, ఆకలి వేసినప్పుడు.. వంట చేయుటకు, మొట్ట మొదట కావలసిoది .. "అగ్గి పెట్టె"! దాని వలననే.. మనము వంట చేయగలము. ఆకలి బాధ తీర్చుకోగలము.
🔆వారణాసిలో.. గంగానదికి సాయం కాలంలో హారతు లిచ్చుటకు,మరియు.. మన దేవాలయము లందు కర్పూరం మరియు వత్తులు వెలిగించడానికి కావాల్సింది.. "అగ్గి పెట్టె"! అట్లే, నల్లని కిరీటంతో కూడిన (అసిత మకుటం) యోధుల సమూహం (తెట్టె)... "అగ్గి పెట్టె"! అనగా, అగ్గిపెట్టెలో నల్లని గంధకం చివర ధరించిన సైనికులలాగ వరుసగా, అగ్గి పుల్లలు వుంటాయి!
🚩తేట గీతి 🚩
అర్చనా మందిర సన్యాసి "అగ్గి పెట్టె" !
అరయ క్షుత్ శాత్రవ ఖరాసి "అగ్గి పెట్టె" !
ఆరతులు గంగకు నొసంగ "నగ్గి పెట్టె"!
అసిత మకుట యోధుల తెట్టె "అగ్గి పెట్టె" !
(రచన: డా.వెలుదండ సత్యనారాయణ., పరమార్థ కవి)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి