"కామ దహనం" సందేశం శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 పంచ శరములు దాల్చి
      జగతినే జయించిన 
      కాముడే మన్మథుడు! 
            ఓ తెలుగు యువత! 
🪷కోరికల నిలయమగు 
     చంచలమగు మనస్సు 
      అదుపులో నుంచాలి! 
              ఓ తెలుగు యువత! 
        ( తెలుగు యువత పదాలు., శంకర ప్రియ., )
 👌"మన్మధుడు" అనగా బుద్ధిని కలియ బెట్టు వాఁడు, అని అర్థము! మదింప జేయు వాడు! కనుక, "మదనుడు"! వీని చేత కోరికలు కోరఁబడును. కనుక, "కాముడు" అని పేరు! 
       ఉన్మాదనము.. తాపనము.. శోషణము.. స్తంభనము... సమ్మోహనము.. అనెడు  అయిదు బాణములు గలవాఁడు.. కనుక, "పంచ శరుడు"! కాముకులను, కామినులను.. తొందర పెట్టువాఁడు. కనుక, "స్మరుడు"! శరీరము లేనివాడు! కనుక, "అనంగుడు" అని, కామ దేవునకు పేరులు! 
 👌లోకకల్యాణం కోసం.. కామదేవుడు దేవతల కోరిక మేరకు, తన మితృడైన వసంతుడిని వెంటబెట్టుకుని, తపోదీక్షలో ఉన్న పరమేశ్వరునిపై, ఐదు పూల బాణాలను సంధించాడు! పరమ శివుని మనస్సును చలింప జేసాడు, మన్మథుడు.
        శ్రీ మహా రుద్రుడు... తపోభంగం కావడంతో  తన మూడోకన్ను తెరిచి, మన్మథుణ్ణి దహనం (భస్మము) చేసాడు. కామునిభార్య, రతీదేవి.. పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో, సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది! అందువలన, ఉమాదేవి వరభంగం కాకుండా ఉండేందుకు, మన్మథుణ్ణి సజీవుని కావించాడు! పిమ్మట, మన్మధుడు.. రతీదేవికి తప్ప, మరెవరికీ తన రూపంలో కనిపించని, వరమును అనుగ్రహించాడు, పరమేశ్వరుడు! 
👌మన్మధుడు.. రూపం కోల్పోయిననాటి నుంచి, మనుషుల మనస్సులలో దాగి, కలవరపెడు తున్నాడు! తన ఐదు బాణాలద్వారా, వారి అసలు పని నుంచి, దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిoచు చున్నాడు . "మన్మథుడు" అంటేనే మనస్సును మథించే వాడు! కనుక, మనిషిలో దాగి ఉన్న.. కామము.. క్రోధము.. లోభము.. మోహము మదము... మాత్సర్యము లనే.. ఆరు అంతః శత్రువులతో మనస్సును మథిస్తున్నాడు!
        ఆ అరిషడ్వర్గము... మనిషిని పతనం కావిస్తున్నాయి! వాటిని (ఆరుగురు శత్రువులను) అదుపులో ఉంచుకోవాలి! అని, పరమేశ్వరుని సందేశము! దీనిని దృష్టిలో  పెట్టుకునేందుకు, కామేశ్వరుడగు శివుడు, "కామున్ని దహనము" కావించాడు. ఆ రోజే .. ఫాల్గుణ శుద్ధపూర్ణిమ! కనుక, "కాముని పున్నమి" అని పేరు వచ్చింది!


            🚩కాముని పున్నమి సందేశం 
   మనస్సును, శరీరమును 
మరిగించే కోరికలకు
చరమగీతం పాడాలని
స్మరుని పండుగ చెబుతోంది !
   అతిక్రమిస్తే అనర్థమని
హరుని తపస్సు చెబుతోంది!
  భంగం చేయకు తపస్సును!
  కోరి తెచ్చుకోకు తమస్సును!
   కోరుకో నిత్యం
కోమలమైన ఉషస్సును!!
       (డా. అయాచితం నటేశ్వర శర్మ.,)
కామెంట్‌లు