విష్ణు రూపిణి... శివాని ; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 విష్ణు రూపిణి వీవె! 
విష్ణు శక్తివి నీవె! 
      వైష్ణవీ! శాంభవీ! 
శ్రీమాతా! శివాని! 
        ( శ్రీమాత పదాలు., శంకర ప్రియ., )
👌"వైష్ణవీ"దేవి .. శ్రీమాతా యొక్క దివ్య లీలా రూపిణి! పరమేశ్వరి యొక్క మూడు మూర్తులలో.. "విష్ణు దేవు"నకు, ప్రపంచసృష్టి పాలనా సామర్థ్యం కలిగిoచుచున్న "శక్తి రూపిణి"! ఈ విశ్వ మoతటా వ్యాపించి యున్న "విష్ణు రూపిణి".. వైష్ణవీజనని! 
👌"వైష్ణవీ! విష్ణు రూపిణి!" అని, శ్రీ లలితా సహస్ర, రహస్యనామ స్తోత్రము నందు.. 892.. 893.. నామము లందు.. శ్రీమాతను ప్రార్ధించారు.. జ్ఞాన ప్రదాత, హయగ్రీవ స్వామి! 
 🚩తేట గీతి పద్యము 
    " వైష్ణవి" ! విష్ణుమాతా! భవాని! కృపను,
       మంచివారిగ జనులను మలచు మమ్మ!
       నిన్ను నమ్మిన శుభములు నిత్య మిమ్ము! 
       నేను నిను నమ్మి కొలెచెడి నేర్పు నిమ్ము! 
            (2)       
          "విష్ణు రూపిణీ"! సద్ భక్తితృష్ణ నిమ్ము! 
           విష్ణు దర్శన భాగ్యమ్ము వేగ మిమ్ము! 
           విష్ణు చింతనతో మది వెలుగనిమ్ము! 
           కూర్మితో నిన్ను సతతమున్ గొలువనిమ్ము! 
       ( శ్రీ లలితా సహస్ర రహస్య నామాzమృతం., రచన : "చిత్ర కవితా సమ్రాట్" చింతా రామకృష్ణా రావు.,)

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం