ఉధంసింగ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 సోషల్ టీచర్ పాఠం చెప్తూ జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జనరల్ డయ్యర్ క్రూరత్వం వివరించింది.శివా అడిగాడు "టీచర్!మరి భారతీయులు చూస్తూ ఊరుకున్నారా?""లేదు. అప్పటి పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్  మహాక్రూరుడు.జలియన్వాలా బాగ్ కాల్పుల్లో అమాయకులు చనిపోయారు.15వేలమంది గాయపడ్డారు. ఉధంసింగ్ అనే యువకుడు భగత్ సింగ్ కి మహాభక్తుడు. 1934లోఇంగ్లాండ్ వెళ్లి  లండన్ లో కెన్సింగ్టన్ అనే ప్రాంతంలో నివసిస్తున్న డయ్యర్ తో స్నేహం చేశాడు. అతని ఇంటికి తరచూ వెళ్లుతూ గూడా శత్రువుని చంపలేదు.21ఏళ్ళు  బాగా ఆలోచించి ఓసభలో పాల్గొంటానికి వచ్చిన డయ్యర్ ని వేదికను సమీపించి కాల్చి చంపాడు. 1940 జులై31న ఉరితీశారు అతన్ని.1974లో షహీద్ ఉధంసింగ్ చితాభస్మం డిల్లీ విమానాశ్రయంకి చేరినప్పుడు వేలాది మంది స్వాగతం పలికారు. "  "టీచర్! ఉధంసింగ్ గూర్చి చెప్పండి ".
"మీరు స్వయంగా  చదివి తెలుసుకోవాలి. సునామ అనే పల్లె లో పుట్టాడు.  2వఏట తల్లి  7వ ఏట తండ్రి చనిపోయారు.అనాధశరణాలయంలో పెరిగాడు. మెట్రిక్ పాసైనాడు.దేశభక్తి తో రగిలే యువకులతో కలిసి సరదాగా గడిపేవాడు.జ్యోతిష్యం చెప్ఫే అతను వస్తే ఉధం హాస్యంగా అన్నాడు "నాచెయ్యికాదు కాలు చూసి చెప్పండి" అని. ఆజ్యోతిష్కుడు కోపం తెచ్చుకోలేదు."బాబూ! నీవు రెండు సార్లు విదేశాలకు వెళ్తావు. నీవు ఓహత్యచేసి ఉరి శిక్ష తో ప్రాణం పోయినా  గొప్ప దేశభక్తునిగా భారత దేశ చరిత్రలో నిల్చిపోతావు." చివరకు జరిగింది ఇదే!
ఉధంసింగ్ జీవిత చరిత్ర చదవాలనే కుతూహలం కలిగింది పిల్లలలో!🌷
కామెంట్‌లు