న్యాయాలు -87
తాళాధిరోహణ న్యాయము
*****
తాళము అంటే తాడి చెట్టు.అధిరోహణము అంటే ఎక్కడం.
తాటి చెట్టు ఎక్కే వ్యక్తిని చేతికి అందినంత వరకే పైకి ఎగదోస్తాం కానీ అటుపైన ఎక్కే సామర్థ్యం అతడికి ఉండాలి.అలా లేకపోతే చేసేదేం లేదు అనే అర్థంతో ఈ తాళాధిరోహణ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే తెలుగులో "గుర్రాన్ని చెరువు దాకా లేదా నీళ్ళదాకా తీసుకొని పోతాం కానీ నీళ్ళు తాగించలేం" అనడం తరచూ నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం.
తాగాలనే బుద్ధి, కోరిక దానికి లేకపోతే దాని మూతిని నీళ్ళలో ముంచినా అది ససేమిరా తాగదు.
ఈ న్యాయమును ఎక్కువగా విద్యార్థులకు అన్వయిస్తూ ఉపాధ్యాయులు వాపోతూ ఉండటం పరిపాటి.
కరోనా అనంతరం విద్యార్థుల వైఖరిలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి.ముఖ్యంగా చదువంటే నిర్లక్ష్యం ఏర్పడింది. తనకు నచ్చిన విషయాలను తప్ప మిగిలిన వాటిని తేలికగా తీసుకునే మనస్తత్వం అలవడింది.
సెల్ ఫోన్లలో గేమ్స్,బెట్టింగ్స్ లాంటివి ఆడటం, విషయ పరంగా చూసి నేర్చుకోవలసినవి, డౌన్ లోడ్ చేసుకొని రాయాల్సినవి పక్కన పెట్టి, అనవసర దృశ్యాలను చూస్తూ మనసు శరీరాలను పాడుచేసుకుంటున్నారు.
అలాగే వారిలో పెరిగిన బద్ధకం, నిర్లక్ష్యంతో పాటు భావోద్వేగాలపై అదుపులేక పోవడం వల్ల లక్ష్యంపై ఉన్న శ్రద్ధాసక్తులను సాధనలో చూపించలేక పోతున్నారు.
అలాంటి వారిని మార్చే ప్రయత్నం "బూడిదలో పోసిన పన్నీరు" లా అవుతోంది.
కాబట్టి స్వతహాగా మనసులోనూ ఆచరణలోనూ లక్ష్యం, సంకల్పం లేని వ్యక్తులను మార్చలేని స్థితిలో తాళాధిరోహణ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అందుకే మన పలుకుబడి ఉపయోగించి వాళ్ళను ఉన్నత స్థాయిలో చూడాలనే కోరిక కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం పెంచి తద్వారా సర్వం సాధించగలం అనే నమ్మకం కలిగేలా చిన్నప్పటి నుండే శిక్షణ ఇవ్వాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి