రాజు రమణ ఇద్దరు మంచి స్నేహితులు ఒకరోజు వారి శెలవని తోటలోకి వెళ్లి ఆడుకుందాం అనుకున్నారు అలా ఆడుకుంటున్నప్పుడు పువ్వులు పళ్ళు కాయలు అన్ని చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. పద్ధతి గల పిల్లలు కదా కాబట్టి వీళ్ళు తెచ్చుకున్న బంతితో ఆడుకుంటూ ఉన్నారు ఆడుతూ ఆడుతూ ఆ బంతి జోరుగా విసరడం వల్ల పక్కన ఉన్న ఒక మడుగులో పడింది అది తీసుకుందామని ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళి చూశారు కానీ వారికి భయం వేసింది
రమణ అన్నాడు వద్దు రాజు అమ్మ చెప్పింది నీళ్ల దగ్గర పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు మనం దిగామనుకో ఏమైనా అయితే పడిపోతే ఎలా అంచేత వద్దురా అన్నాడు
సరేలేరా మా నాన్న అనే వాడు ఏదైనా మీ తెలివి ఉపయోగించండి అనేవాడు
సరే అనుకున్నారు ఇద్దరూ ఒకడు తాడు కోసం ఒకడు పొడవాటి కర్ర కోసం వెతికారు ఎలాగైతే నే ఇద్దరికీ రెండు దొరికే కానీ సమస్య. ఎలా తీయాలి అని
అప్పుడు రమణ కర్రతో మెల్లిగా బంతిని ఒడ్డు దగ్గరికి లాగి ఆలాగే పట్టుకున్నాడు.
రాజు ఆ తాడు మెలికేసి బంతి మీద పడేసి పట్టుకొని తాడుతో మెల్లిగా లాగుతూ ఉంటే రమణ బాలుని మెల్లిమెల్లిగా పైకి తోస్తూ వచ్చాడు అందుకొనే అంత దూరం వచ్చిన తరువాత రాజు మెల్లిగా వంగి ఆ బంతిని పట్టుకున్నాడు పైకి తీశాడు ఇద్దరికీ సంతోషం అయిపోయింది ఆ తర్వాత ఆట ముగించి ఇంటికి వెళ్లారు
ఇద్దరూ కూడా తాము చేసిన పనిని తాము ఉపయోగించిన ఉపాయాన్ని వారి పెద్దలకి చెప్పారు చెప్తే వారు మీరు బ్రహ్మాండంగా సాధించారు. ఆపద లేకుండా బాగుంది. అందుచేత తొందరపడి అపాయం తెచ్చుకోవద్దు. నిదానంగా ఆలోచించి ఉపాయంతో ఏ ఆపదనైనా గట్టెక్కవచ్చు అని అన్నారు పెద్దలు. అందరూ ఆశీర్వదించారు.
శుభం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి