" తెల్లవారింది.... ! ";- కోరాడ నరసింహా రావు.
   మసక వెలుగులతో... 
    తొలిపొద్దు పొడిచింది.. !
పెరటి చెట్టు నుండి... 
     ఆకుల  గలగల లు , 
       కిల - కిల పక్షుల 
       రవములే వినవచ్చె !
కావు -  కావు మనుచు... 
       కాకుల  అరుపులు  !
 కొక్కొరొక్కో యని.... 
       కోడికూతలతో... 
  తూరుపు కొండెనక... 
    ఎర్రని  వెలుగులు... !
చీకట్లు చీల్చుకుని 
   బాల భానుడు వచ్చె 
లేవండి పిల్లలూ తెల్లవారింది 
  త్వర - త్వరగ మీరు... 
   తయా రవ్వండి... !
వడి - వడిగ స్కూలుకు... 
       బయలు దేరండి... !!F
దారిలో  దేవునికి... 
      దండాలు పెట్టండి.. !
 శ్రద్దా శక్తులు,విద్యా బుద్ధులను
 ప్రసాదించమని.... ప్రార్ధనలు 
             చేయండి... !!
తోటిపిల్లలతో... 
           స్నేహంగ మెలగండి... 
చదువులో ఏనాడు  వెనకబడ కండి... !
  క్లాసులో ఫస్ట్ గా... 
        మీరు రావాలి.... !
  మిము జూచి మేమెంతొ 
       సంత సించాలి... !!
     ******

కామెంట్‌లు