కోరాడ హైకూలు

   పరిమళిస్తూ... 
   రంగులు , రుచులతో 
    పుడమితల్లి.... !
     ****
పంచభూతాలు... 
  ప్రతిఫలిస్తున్నాయి... 
    మనిషి లోనే... !
   ******
కాలికి... దెబ్బ... 
  ఏడుస్తూ ఉంది కన్ను 
   అచ్చం  అమ్మలా... !
  ******
   పాలించే వారు... 
     అవకాశవాదులే  !
     ప్రజలుకూడా... !!
     ******
పంచభూతాలూ... 
 నివ్వెరపోతున్నాయి  !
   మనిషిని చూసి.. !!
      ******
కామెంట్‌లు