భావనప్రియ-దత్తాంశం--అంకురార్పణ--ఈవిమాను(కల్పతరువు);- కిలపర్తి దాలినాయుడు
చుక్కల పల్లకినెక్కిన చంద్రుని
చేరుట కష్టము కాదు సుమా!
రెక్కలు మేనా దక్కిందంటే
రిక్కలనేరుట వీలు సుమా!

గరళము త్రాగిన మృత్యువునాపుట
సాధ్యమేననీ నమ్ము సుమా!
గరళకంఠుని గొల్చినవానికి
మిత్తిదగ్గరకు రాదు సుమా!

మేఘమాలికల, మెరుపు తీగె లను
మేను ధరించుట వీలుసుమా!
కాంతిదూతలను నింగికిపంపిన
సంతసాలుపండించు సుమా!

మానవుడే మహనీయుడన్న
నారుద్రుని మాటలు నిజము సుమా!
మెదడు పొలములో విత్తినయోచన
ఈవిమానువలె  తీర్చుసుమా!
----------------------------------


కామెంట్‌లు