* చిత్రకవిత *--.....మధురస్వప్నం !- .. కోరాడ నరసింహా రావు,
బెదురుచూపుల లేడి కళ్ల పిల్ల 
ఊయలూగాలన్న ఉత్సుకతతో 
తీరని తన కోరికను పదే - పదే 
తలచుకుంటు, పవళించగా., 

తనకోరిక దీర్చ గా మధుర స్వప్నమై 
వచ్చెను ఊహించని విధముగా... !

   అందనంత ఎత్తులో...    
దుప్పికొమ్ములకు కట్టిన ఊయలపై కూచొని... 
   భువినుండి దివికి... 
   దివినుండి భువికి... 
 రయ్యి - రయ్యి మని ఊగుతు 
  తారా చంద్రులను తాను.... 
పలుకరించి వచ్ఛోకినటుల 
 కలగన్న పరవశమున... 
స్థానువై పోయినటుల, కలలో 
తన కోరికను దీర్చు కొంటున్నది 
    ********

కామెంట్‌లు