బాలల మాసపత్రిక మొలక మాసపత్రిక పుస్తకాన్ని ఆవిష్కరించినవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి; - వెంకట్ మొలక ప్రతినిధి
 

 పాఠశాల విద్యార్థి దశ నుంచి సాహిత్య కళను చిగురింపజేస్తున్న మొలక మాసపత్రిక కృషి ప్రశంసనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
 ఆదివారం హైదరాబాద్ నగరంలో  శంకరమ్మ ఫంక్షన్ హాల్ లోమార్చి నెల  మొలక మాసపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల సాహిత్యాన్ని  రాష్ట్రవ్యాప్తం చేసెందుకు మొలక చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి పాఠశాలకు చెందిన విద్యార్థినిలు మణిపూసలు అని నూతన మాత్రా ఛందస్సు గేయ కవితలు రాయడం హర్షించదగ్గ విషయం అన్నారు. మాత్ర గణాలతో కూడిన చందస్సు ప్రక్రియలు మణిపూసలు రాయడం ఎంతో ప్రశంసనీయమన్నారు. పాఠశాలలోని 252 మంది విద్యార్థినిలు రాసిన మనిపూసల కవితా సంకలనం మిణుగురులు మరింత బాగున్నాయని అన్నారు. తెలుగు సాహిత్యంలో విద్యార్థి దశ నుంచి తీయడం ఎంతో సాహిత్య కృషి అన్నారు. తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థినులను ఆకర్షితులను చేస్తున్న పాఠశాల సిబ్బందిని మంత్రి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తీరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మొలకను రాష్ట్రవ్యాప్తం చేస్తాం: సంపాదకులు వేదాంత సూరి
మొలక  బాల సాహిత్య మాస పత్రికను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేస్తామని పత్రిక సంపాదకులు వేదాంత సూరి అన్నారు మంత్రి చేతుల మీదుగా మొలక మాసపత్రికను ఆవిష్కరించిన అనంతరం బాలసాహిత్యాన్ని తెలుగులో భావితారాలైన విద్యార్థి దశ నుంచి పటిష్టం చేస్తున్నామని వేదాంత సూరి అన్నారు. మాస పత్రికలో మార్చి నెలలో సంఘము లక్ష్మీబాయి విద్యార్థినిలు రాసిన మణిపూసలు గేయ కవితలు సంకలనాలను పుస్తకాలను వివరిస్తూ ఈనెల తెలంగాణ మిణుగురులు ఈ బాలికలు అనే శీర్షికతో మాసపత్రిక ముఖచిత్రాన్ని ప్రచురించి కవర్ పేజీ వార్తగా మణిపూసలను ప్రశంసించామని వేదాంత సూరి అన్నారు.
సన్మానం
ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా మొలక సంపాదకులు వేదాంతం సూరి ని శాలువతో సన్మానించారు సాహిత్యానికి వీరు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మొలక మాసపత్రిక సంపాదకులు వేదాంత సూరి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, మణిపూసలు మణిపూసల రూపకర్త  వడిచేర్ల సత్యం, పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ, సంగం లక్ష్మీబాయి పాఠశాల కమిటీ చైర్మన్ గోపాల్, కోశాధికారి రత్నం, మొలక ప్రతినిధి వెంకట్ తెలుగు పండితులు అంజిలప్ప, బాలకృష్ణ పాల్గొన్నారు.

కామెంట్‌లు
Dr. Surya Prakash Rao చెప్పారు…
వేదాంత సూరి గారికి అభినందనలు. మీ కృషి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.
-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
రాథోడ్ శ్రావణ్ చెప్పారు…
తెలుగు సాహిత్యానికి మీ కృషి అభినందనీయం మొలక ఆన్లైన్ పత్రిక సంపాదకులు గౌరవ, శ్రీ, వేదాంత సూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. రాథోడ్ శ్రావణ్ ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా