అందని మ్రాని పండ్లు:-
ప్రయత్నం చేసినను పొందరాని వనుట.
ఈ జాతీయము ఈ క్రింది కధ వలన పుట్టిందంటారు.
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆకలి కడుపులో అలజడి చేస్తుంటే అడవి అంతా ఆహారం కొరకు గాలించింది. దానికి ప్రొద్దుట నుండి సాయంకాలం వరకు ఏమీ లభించలేదు. పోతూ పోతూ ఉంటే దానికి ఓ చెట్టు కొమ్మనా ద్రాక్ష తీగ కనిపించింది. ద్రాక్ష పండ్లు కనిపించాయి? ఆహా! భగవంతుడు నాకోసమే ఈ పండ్లను ఇక్కడ ఉంచాడనుకొని వాటిని అందుకొనుటకే టపీమని ఎగిరింది. ఎగిరి కింద కూలబడింది. ఆ ప్రయత్నంలో ద్రాక్ష పండ్లు అందలేదు. మళ్లీ ఎగిరి కింద ఢాం అని పడింది. ఇట్లా ఎన్నో మార్లు ఎగురుట కింద పడిపోవుట జరిగింది. అయినా పండ్లు అందలేదు. అంటే దాని ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. అందని మ్రా ని పళ్లకు అర్రులు చాచుట ఎందుకని అనుకొన్నది.
మన సమాజంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన పనులు కాకపోతే అప్పుడు అవి అందని మ్రాని పళ్ళు అని జాతీయం పుట్టింది.
తెలుగుజాతీయం.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి