అడవిగాచిన వెన్నెల.
ఎంతో మనోహరమైనను వ్యర్థము అను అర్థము కలదు. అడవిలో వెన్నెల కాస్తే ఏమి లాభము? వృధా యేకదా. ఒక అందమైన స్త్రీ యవ్వనంలో పెండ్లాడకపోయినచో వయస్సు మీరినచో ఆ యవ్వనం అడవిగాచిన వెన్నెలయే.
సముద్రమున కురిసిన వాన, అపాత్రునికి ఇచ్చిన దానం, పేడికి చేసిన పెండ్లి, అడవిగాచిన వెన్నెలలే. అక్షరాలు రాని వాడికి పదవి అప్పగించిన ఇట్టి ఫలితమే వస్తుంది. అయినా మనం అనుకుంటుంటాము. కానీ అడవిన వెన్నెల గాచక మానదు. వర్షం కురువక పోదు-అంటే అర్థము వ్యర్థము అను మాట రూఢము.
;-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి