సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -71
జల మథన న్యాయము
*****
జలము అంటే నీరు.మథనము అంటే మదించుట లేదా చిలుకుట. పాలు మథించిన వెన్న వస్తుంది.కానీ నీటిని మథిస్తే శ్రమ,అలసట, ఒళ్ళు నొప్పులు తప్ప ఒరిగేదేమీ లేదు.
దీనికి సామ్యంగా గొడ్డుటావును ఉదహరిస్తుంటారు.
గొడ్డుటావు దగ్గరకు వెళ్ళి పాలు పితకడం వల్ల పాలు రావు.వృధా ప్రయాస అనే అర్థంతో ఈ జల మథన న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలాంటి అర్థం వచ్చే వేమన పద్యాలను చూద్దాం.
'గొడ్డుటావు బిదుక గుండ గొంపోయిన/పాలనీక తన్ను పండ్లు రాల/ లోభివాని నడుగ లాభంబు లేదయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
గొడ్డుదైన ఆవు దగ్గర పాలు దొరకవు.పిండాలని అనుకోవడమే తప్పు. అలాంటిది పిండటానికి కుండ తీసుకుని వెళితే ఏం చేస్తుంది?.పళ్ళు రాలేటట్టు తంతుంది. అలాగే 'అసలే లోభి.ఆ విషయం తెలిసి కూడా  దానం ధర్మం చేయమని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా?' అంటే ఉండదు కదా. ఇలాంటిదే మరో పద్యాన్ని చూద్దాం.
మేక కుతిక బట్టి మెడచన్ను గుడవంగ/ ఆకలేల మాను ఆశగాక/ లోభి వాని నడుగ లాభంబు లేదయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
కొన్ని మేకలకు మెడకింద పాలిచ్చే స్తనాల్లా రెండు వేలాడుతూ ఉంటాయి. కానీ అందులో పాలు వుండవని అందరికీ తెలుసు.ఉంటాయని ప్రయత్నించడం వృధా ప్రయాస.అదే విధంగా 'లోభి పిల్లికి కూడా బిచ్చం వేయడు'. 'ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు.' అంటుంటారు. అలాంటి వ్యక్తిని అడిగితే అనవసర శ్రమ తప్ప  ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఉండదు కదా!.
అలాగే "నీటిలోంచి ఏదో వస్తుందని చిలకడం ఎంత నిష్ప్రయోజనమో, దానిని మనుషులకు వర్తింప చేస్తూ  ఇలాంటి ఉదాహరణలు మన  వెనుకటి  వాళ్ళు సందర్భోచితంగా ఎన్నో  చెప్పడం చాలా గొప్ప కదా!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం