పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న 'స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు గా(2023-2024) ఎంపికయ్యారు.ఈమేరకు ఆ సంస్థ చైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.గతంలో SEIF జిల్లా కోశాధికారిగా గద్వాల సోమన్న పనిచేసిన సంగతి విదితమే.'బలవన్మరణాలు లేని భారతదేశం'గా చూడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న ఈ ఫౌండేషన్ కు ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడం పట్ల సోమన్న సంతోషం వ్యక్తం చేశారు.మహోన్నత ఆశయాలతో ,చిత్త శుద్ధితో అడుగులు వేస్తున్న నిస్వార్ధ సేవా సంస్థతో కలసి పనిచేయడం మధురానుభూతిగా అభివర్ణించారు గద్వాల సోమన్న. తన మీద నమ్మకం తో SEIF ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసినందుకు చైర్మన్ శామ్యూల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు సోమన్నను అభినందించారు
'SEIF' కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడుగా సోమన్న ఎంపిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి