*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 091*
 కందం:
*యోగ్యుల నరయగ లేక య*
*యోగ్యులకున్ దాన మొసగుచుండుట యిది స*
*ద్భోగ్యసతిన్ షండునకున్*
*భాగము గని పెండ్లి చేయు పగిది కుమారా !*
తా:
కుమారా! దానము తీసుకోడానికివాన్ని అర్హతలు ఉన్న మనిషి దొరకలేదని, ఏ అర్హతలు లేని వాడికి దిచ్చున దానము ఎందుకూ నికి రాకుండా పోతుంది. అలాగే అవుతుంది, చక్కని భార్య కాగల ఒక అందమైన, మంచి కుటుంబం లో పుట్టిన స్త్రీని ఎందుకూ కొరగాని వానికి ఇచ్చి వివాహం జరిపిస్తే............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"అపాత్రదానం ఎప్పుడూ సరి కాదని" పెద్దల మాట. ఈ అపాత్రత ఎదుటి మనిషి నడవడిక వల్ల, ఒక పనిని పూర్తి చేసే నైపుణ్యం వలన మనం గుర్తించవచ్చు. ఇటువంటి వారికి చేసే, శ్రమదానం, సంపద దానం, మాట సహాయం ఇలా ఏదైనా, ఎటువంటి మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే, మన సహాయాన్ని ఎలా వాడుకోవాలో, ఆ చంచల బుద్ధి కలవానికి తెలియదు. రావణుని పక్కన ఉన్న విభీషణుని సలహాలు లాగా. సభా పర్వం లో విదురుడు, భీష్మ పితామహుడు మొదలైన పెద్దల సలాహాలు యుధిష్టురునకు రుచించ లేదు కదా! అలాగే. అందువల్ల, అవసరమైన వారికి, ఇచ్చిన సలహా సరైన దారిలో, సమయంలో తీసుకో గలిగిన వారికి మాత్రమే సలాహాలు, సహాయం చేసే సద్బుద్ధిని మనకు ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు