బీహార్.
బీహార్ బౌద్ధ విహారాలకు, జైన మందిరాలకు, హిందూ దేవాలయాలకు, ముస్లిం ప్రార్థన స్థలాలకు ప్రసిద్ధిగాంచినది. బౌద్ధ చైత్యాలు, ఆరామాలు ఎక్కువగా ఉండుటచే పూర్వం దీనిని విహార్ గా పిలిచేవారని ప్రతీతి. రాష్ట్ర రాజధాని అయిన పాట్నా గతంలో పాటలీపుత్రంగా పిలువబడింది. మా ఊరిలో గుప్తులు, సుల్తానులు, మొగల్ చక్రవర్తుల పరిపాలన తరువాత బ్రిటిష్ వారిచే ఈ రాష్ట్రం పరిపాలించబడింది. బ్రిటిష్ వారికి 1764 బక్సార్ యుద్ధం ద్వారా ఈ ప్రాంతం సర్వాధికారాలు లభించాయి. ఇది 1911 వరకు బెంగాల్ లో ఒక భాగంగా ఉంది. గంగా, దామోదర, సువర్ణ రేఖ, కోసి, గండక్, పాల్గు, దుర్గావతి నదులు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఖనిజ సంపద అపారంగా ఇక్కడ లభిస్తున్నది. ముడి కనిజాలు, బొగ్గు, యురేనియం, సల్ఫర్, మైకా, రాగి , వంట బొగ్గుల ఉత్పత్తిలో దేశంలో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. నలంద, బుద్ధ గయ, హజారీబాగ్, పాట్నా రాంచి వైశాలి, రాజ్నాథ్ అను నవి. ముఖ్యమైన పర్యాటక కేంద్రాలు.
ఒరిస్సా. హిందూ మతం, జై నిజం, ఇస్లాం, ప్రధాన నగరాలు. భువనేశ్వర్, కటక్, ఛత్రపూర్, పూరి, సంబంల్ పూర్, బాలాంగిర్, బరాఘర్, భవాని పట్నం, రూర్కెలా, బలేశ్వర్, భద్రక్, రాయగడ, బరంపూర్ కేంద్ర పాలిత రాష్ట్రాలు.
ప్రాచీన కాలంలో మౌ ర్యు లు, గుప్తులు, శిశునాగులు, ఒరిస్సాను పరిపాలించారు. వరిసాను పూర్వం కళింగ, రుద్ర అని పేర్లతో పిలిచేవారు. ఈ రాష్ట్రం భారత ఉపఖండంలో ఈశాన్యపు భాగంలో ఉంది. ఉత్తర పేట భూమి, మధ్య నదీ ప్రాంతం, తూర్పు కొండలు, కోస్టల్ మైదానాలు అనే నాలుగు ప్రత్యేక భౌగోళిక విభాగాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని మూడు వంతులు పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 59 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోణార్క్, పూరి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
ఏప్రిల్ 1 బీహార్ , ఒరిస్సా అవతరణ దినం.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి