విద్యార్థులు బాల్యం నుండే కథలు చదవడం రాయడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు పంచతంత్రం వంటి నీతి కథలు భోధించాలి. ఆ కథల ద్వారా విలువలు పెంపొందుతాయి .ఉత్తమ
జీవన విధానం అలవడుతుందని తెలంగాణ విశ్వ విద్యాలయం తెలుగు ఆచార్యులు ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి గారు అన్నారు.
సుగుణ సాహితీ సమితి సిద్దిపేట ఎప్రిల్ 4వ తేదీ మంగళవారం రోజున స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉగాది బాలల కథల పోటీ -2023 బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 20 మంది విజేతలకు 9200 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. బాలసాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న 16 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. సుగుణ సాహితీ సమితి కన్వీనర్ బైతి దుర్గయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్దిపేట మండల విద్యాధికారి సత్తు యాదవరెడ్డి, బాల సాహితీవేత్త వాసరవేణి పర్శరాములు, రాళ్లబండి పద్మయ్య గార్లు బాల సాహిత్య వికాసం గురించి,సుగుణ సాహితి సమితి చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రసంగించారు. యువ కవి వేల్పుల రాజు సభా సమన్వయం చేయగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.అనంతరం యాడవరం చంద్రకాంత్ వ్రాసిన చంద్రుడు చెప్పిన కథలు బాలల కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. బహుమతి పొందిన 20 మంది విద్యార్థులకు రామసక్కని గాలిపటం, బాల మందారాలు,చంద్రుడు చెప్పిన కథలు బాలల పుస్తకాలు బహుకరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి