అనుభవం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితంలో మనం అనేక  నానుడులు వింటూ ఉంటాం.  మన పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పిన విషయాలు  తరువాత అనూచానంగా నలుగుతూ తయారయినాయి  వాటిని అన్నిటినీ ఆచరించాలా ఆచరించగలమా సాధ్యాసాధ్యాలను కనక మనం ఊహించుకున్నట్లయితే నిజానికి అసాధ్యమే సర్వేజనా సుఖినోభవంతు అని ఉన్నది అది ఎవరివల్ల సాధ్యం ప్రభుత్వాలే చేయలేని పని ఒక వ్యక్తి ఎలా చేయగలడు  అలా ఆలోచించినప్పుడు  బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది  సరి అయినదేమో అనిపిస్తుంది  నీకు తెలిసిన కొంతమంది అయినా సుఖవంతమైన జీవితానికి అలవాటు చేసినట్లయితే  సమాజంలో అసమానతలు తగ్గి ఆనందమయ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం  కనుకనే ఆకాశవాణి వారు దానిని మకుటంగా ఏర్పాటు చేసుకుంది. జీవితంలో పెద్దలు చెప్పిన విషయం మానవునికి వచ్చే కష్టసుఖాలు కావడి కుండల లాంటివి  కావడి కి రెండు ప్రక్కల రెండు  బరువులు ఉంటాయి ఒకటి  కష్టాలకు రెండవది సుఖాలకు  ప్రతీకలు అనుకుంటే ఆ రెంటిని సమానంగానే మనం మోయాలి  అని కావిడి మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది  దానిని జీవితంలో అనుభవించిన మహానుభావులు  ఆధ్యాత్మికవేత్త రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది  ఒక దెబ్బ తగిలినప్పుడు  దాని బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తే తప్ప తెలియదు  ఆ క్షణాన నీవు బాధను అనుభవించినా  దానిని అనుభవంగా గనుక తీసుకున్నట్లయితే  అది ఎలా జరిగింది మనం చేయడం వల్ల తప్పు జరిగిందా లేదా సహజంగా జరిగిందా అనేది ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గం కూడా తెలుస్తుంది.
అలాగే మంచి జరిపినప్పుడు చాలా ఆనందిస్తాం ఆ ఆనందం క్షణికమా కాదా అన్న విషయం తర్వాత  అది ఎలా జరిగింది  మనం చేసిన మంచి పనికి అది ప్రియతమా లేక మరి ఎలా వచ్చింది అని ఆలోచించినప్పుడు దాని మూలం ఏంటో తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు నీకు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు  దానిని పూర్తిగా అనుభవించాడు కనుక రమణ మహర్షి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగారు  అలాగే ప్రజల కోసం పాటుపడి జీవితాలు సుఖమయంగా ఉండడానికి  బడుగు జీవులు ఉన్నత స్థితికి రావడానికి ఏం చేయాలి అని ఆలోచించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వాన్ని సంప్రదించి తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్య  మువహించి  బడుగు బీద ప్రజల కోసం ఎన్నో పథకాలను రచించి ఎన్నో ఉపకారాలు చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.



కామెంట్‌లు