రెడ్ల పుట్టుక (8)-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
రెడ్లలో నూటికి ఎనభై మందికి పైగా ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు జనసంఖ్యలో 0.3% మంది మాత్రమే సంపన్నులు ఉండగా  20% మేర ఎగువ దిగువ మధ్యతరగతి పరంగా ఉన్నట్లు అంచనా. రెడ్డి కులం కేవలం కొందరు సంపదలు మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వడానికి తోడ్పడింది. విశ్లేషకులు రెడ్లబలాన్ని గ్రాస్ రూట్లో  వాడుకున్న సంపన్న పెద్ద రెడ్లు రాష్ట్రస్థాయికి చేరుకోగానే తమ కాలాన్ని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి  అధికార పంపిణీలో కులాలు వర్గాల మధ్య సమతుల్యానికి  అధికారం ద్వారా సులభంగా సాధించగల ధనార్జనకు వెచ్చించారే తప్ప  తమ కులస్తులు ఆర్థిక సాంస్కృతిక స్థాయిల పెంపులకు ఎటువంటి చర్యలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు.
సుమారు కోటి 20 లక్షల మంది గల రెడ్లలో కొన్ని వందల మంది పెద్ద రెడ్ల చర్యల కారణంగా 50% పైగా దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న రెడ్లు కూడా  రోలింగ్ క్లాస్ అగ్రవర్ణం పేరుతో మరింత నష్టానికి గురవుతున్నారు  పైగా కొందరు పెద్ద రెడ్ల తప్పులను ఇతర రెడ్లు అందరూ మోయాల్సి రావడం దురదృష్టకరం  వెనుకబడిన ప్రాంతాలైన తెలంగాణ రాయలసీమ జిల్లాలోని నివసిస్తున్న లక్షణాలు రెడ్ల కుటుంబీకులు సరైన జీవనోపాధి  లభించక  అనేక సంవత్సరాలుగా కడగండ్లతో కష్టాలతో పరువు ప్రతిష్టల కోసం చావలేక బ్రతుకుతున్నారు  రాజకీయంలో మంత్రులు ముఖ్యమంత్రులుగా  ఎదిగినవారు  పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు స్థాపించి వర్తక వాణిజ్య రంగాలలో ఆర్థికంగా  శిఖరాలకు చేరిన వారు పాలనా రంగంలో ఉన్నత పదవులు చేపట్టిన వారు రెడ్లలో ప్రముఖులు ఉండడం గర్వకారణమే.
అయితే దారిద్ర రేఖ దిగువన జీవనం కొనసాగిస్తున్న లక్షలాది రెడ్ల కుటుంబాలను ఉద్ధరించిన నాడే  రెడ్డి జాతి పూర్వవైభవం సిద్ధించినట్లు అందుకు రెడ్లలో ఐకమత్యం కావాలి రావాలి  రెడ్డి శబ్దము ఈశ్వర వాచక రాష్ట్ర శబ్దం నుంచి ఉద్భవించినది అనడానికి  దేవతలకు రెడ్డి శబ్దం ఉపయోగించిన

సిస పద్యములను కూడా గమనించదగినది  అహోబిలం  సంగారెడ్డి తిరువల్లూరు వీరరాఘవ స్వామి దేవాలయము నందు శిలా శాసనములలో పెద్ద కోమటి వేమారెడ్డి తనను సూర్యవంశజునిగా చెప్పుకొనుట శ్రీ వైకుంఠ విష్ణు క్షేత్రమునందు శిలాశాసనంలో రాజమహేంద్రవరం సూర్య వంశజనితగా చెప్పుకొనుట కూడా ఇక్కడ గమనించదగి ఉన్నది.
కామెంట్‌లు
అన్ని కులాలలోనూ ఈ విధంగానే జరుగుతుంది. కాకపోతే కమ్మవారిలో తమ తోటి వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చే గుణం. ఎక్కువ.