చిన్న కుటుంబం చింతలేని కుటుంబం;--ఎడ్ల లక్ష్మిసిద్దిపేటచరవాణి : 8466850674
 చుక్క  "పొద్దుకు నిద్ర లేచి ఆగమాగం పొలం వద్దకు వెళ్లాడు చంద్రయ్య. అప్పుడే తొలి కోడి కుకురుకూ అంటూ కూస్తుంది, కోడి కూత వినగానే చంద్రయ్య తల్లి మణెమ్మ నిద్రలేచి పాసి పనులన్నీ చేస్తుంది.
  చంద్రయ్య భార్య చేమంతి కూడా నిద్రలేచి గబా గబా వంటలన్నీ చేస్తుంది. పిల్లలను నిద్రలేపి స్నానం చేసి , భోజనం ముగించుకుని తొందరగా బడికి వెళ్లండి అని పిల్లలకు చెప్పి, వారికి పగటి సద్ది కూడా కట్టి పెట్టేస్తుంది.
   వారి నానమ్మ గబగబా వచ్చి నవ్య , నవీనులకు స్నానాలు పోసి చిట్టి పొట్టి కథలు చెప్పుతూ బొజ్జ నిండా తినిపిస్తుంది. పిదప వారి బ్యాగులు పట్టుకుని వారిని తోలుకొని బడి వరకు దింపేసి వస్తుంది.
     సాయంకాల సమయం కాగానే ఊరికి వెళ్ళిన వారి తాత నరసింహులు వచ్చి స్కూల్ కెళ్ళి పిల్లలను ఇంటికి తోలుకొని వస్తాడు. 
ఆ పిల్లలకు , బడిలో వారి ఉపాధ్యాయులుగా చెప్పినవన్నీ వారికి అర్థమయ్యేలా చెప్పుతూ తప్పులు పోకుండా మొత్తము వారితో రాపిస్తాడు. తరవాత వారితో ఎన్నో ఆటలు ఆడిస్తాడు. రాత్రివేళ మనుమడు మనుమరాలు కొడుకు కోడలు తో కలిసి నానమ్మ తాతలు సంతోషంగా     భోజనం చేస్తారు. వారిది చిన్న కుటుంబం అన్యోన్యతగా కలిసిమెలిసి ఉంటారు . నానమ్మ చెప్పే కథలతో తాత చెప్పే నీతులతో , ఎంతో పరిజ్ఞానం పెంచుకుంటారాపిల్లలు. 
అమ్మ చెప్పే మాటలతో నాన్న చెప్పే పనులతో ఎన్నో బాధ్యతలను నేర్చుకుని , పిల్లలు పెరిగి పెద్దవారై సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు . 
ప్రతి పిల్లలు "పెద్దల చేప్పే మాటలు శ్రద్ధగా వింటే చక్కటి జ్ఞానమును పొందగలరు.

కామెంట్‌లు