రావిపల్లి వాసుదేవరావు--పార్వతీపురం9441713136
పుడమి (బాల గేయం)

మానవాళి మనుగడకు ఆధారం ధరణి
జీవకోటి ఉనికిని నిలబెట్టేది ధరణి
ఆకుపచ్చ జగతికీ మూలమే అవని
మనిషికీ జీవులకూ ఆదరువే అవని

పంచభూతాలులో ప్రధమం ఈ పుడమి
జీవుల భారాన్నంతా మోసేదీ పుడమి
పోషకాలు తో నిండిన తల్లిరా ఈ భూమి
మట్టి పరిమళాలనూ పంచేదీ భూమి

పంటలను సమృద్ధిగా ఇచ్చేది ధరణి
పండూ కాయను వరముగ ఇచ్చేది ధరణి
విలువైన ఖనిజాలను కలిగినదీ
అవనీ
విశ్వంలో సుసంపన్నమైనది ఈ అవనీ


జీవవైవిధ్యానికి ఆలవాలమీ పుడమి
సకల సంపదలకూ నిలయమీ పుడమి
ఈ పుడమిని బిడ్డ లా సాకుదాము రండీ!
నేలతల్లి ఒడిలోన ఆడుదాము రండీ!
కామెంట్‌లు