భూమి నేను;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-98493058710
ఆకాశం నా నెత్తినుంది కిరీటంలా  
నా మనసూ ఒళ్లంతా మట్టి పాటే    
ఆకుపచ్చని చెట్లూ అడవీ కొండలూ 
ప్రకృతి నాలోని ఊపిరి

సూర్యుని వేడి సుర్రుమన్నది పైనుంచి 
నా మట్టిఎద కాలింది కాళ్ళకింద 
ఇంటి రేకుల పైకప్పులా 
నా సిగ పూలన్నీమాడిపోయే 
మనిషి బతుకు కునారిల్లే
 
నాలో ఉష్ణతాపం పెరిగింది 
పర్యావరణ సమతుల్యత గుండె గూడు చెదిరింది
సముద్రాలు నన్ను తాకుతున్నవి మరీ దగ్గరకొచ్చి
నదులు కలుషితమై వరదలతో 
నా గుండె గాయమైంది 

భావుకతలో కవితలైనవి 
వాస్తవికత పరుచుకున్న వస్తువులో 
ఆకాశాన్ని తాకే భవన నిర్మాణాలు పెరిగే
పచ్చని చెట్లూ,ప్రకృతి సంపద తరిగే

నేను భూమిని
నన్ను నేను కాపాడుకున్న 
ఆరోగ్యం నా బతుకు      
ఓ జీవ కళ మనిషి మనుగడ 
 


కామెంట్‌లు