శ్రీరామ రక్ష! సర్వ జగద్రక్ష! ;-- శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
🔆శ్రీరామ! రక్షమాం! సోమ!
సర్వ జగద్రక్ష! భీమ!
     జగదభిరామ! రామ! 
శివరామ! జయరామ!
🔆రామ! రవికుల సోమ! 
రామ! రణరంగ భీమ! 
     జగదభిరామ! రామ! 
శివరామ! జయరామ!
          (..అష్టాక్షరి పదములు,, శంకర ప్రియ.,)

👌"రాముడు" అనగా, రమిoప జేయువాడు! అందరి యందు "ఆత్మ చైతన్య మూర్తి"గా, క్రీడించు వాడు.. రాముడు! సచ్చిదానందమయ పరంబ్రహ్మ స్వరూపుడే "రాముడు"! నిత్యము శుభములు, మంగళములు కలిగించు వాడు! కనుక, "శివ రాముడు"! శ్రీరాముడే... సోముడు! ఉమాకాoతు డయిన పరమేశ్వరుడు! 

👌కోదండపాణి అయిన, రాముడే... ప్రజలoదరికి రక్షకుడు! లోక పాలకుడు! కనుక, "శ్రీరామ రక్ష! సర్వ జగద్రక్ష!" ..అనునది.. దివ్య మంత్రము! ఈ నామ మాలిక... ఆరాధకులకు, సాధకులకు... ఆత్మ రక్షణ కవచము! అనుదినము స్మరణము చేయండి!
 🕉️ శ్రీరామ! శివరామ! జయ శివరామ! 

          🚩 కంద పద్యము 
 🪷రామా! సీతాపతి! శ్రీ
     రామా! కోదండరామ! రావణ హర్తా!
     రామా! మానవ రూపా!
     రా! మా! మానవులనెల్ల రక్షింపంగన్!
                  (2)             
🪷రామా! సద్గుణ ధామా!
     రామా! సీతాసమేత లక్ష్మణ హనుమా!
     రామా!మా మానసమున
     రామా! ప్రార్థింతు మయ్య! రా రామయ్యా!

            (.. మాడుగుల మురళీధర శర్మ.,)

కామెంట్‌లు