కావు కావు మయ్య! (అష్టాక్షరి గీతి ) శంకర ప్రియ., శీల.,--సంచార వాణి: 99127 67098
ఆపద మొక్కుల వాడ!
అనాథ రక్షక! స్వామి!
       కావు కావుమయ్య! మమ్ము!
 ఓ మార్కoడేయ వరద!  (1)
         
      బాలుని మార్కoడేయుని
సంరక్షిoచిన సాంబయ్య!
     కావు కావు మయ్య! మమ్ము!
ఓ మార్కడేయ వరద! (2)

      వెండి కొండల దేవర!  
 పార్వతీ రమణ! స్వామి!
      కావు కావు మయ్య! మమ్ము!
 ఓ సిరియాళ వరద!(3)

      భక్తుని సిరియాలుని
బ్రతికిoచిన శివయ్య!
      కావు కావు మయ్య! మమ్ము!
 ఓ సిరియాళ వరద! (4)
               
      మూడు రూపముల వాడ!
ముజ్జగముల కారక!
       కావు కావు మయ్య! మమ్ము!
 ఓ ప్రభాకర వరద! (5)
         
      నవ్య దివ్య ప్రభలతో
వే వెలుగుల శివయ్య!
     కావు కావు మయ్య! మమ్ము!
ఓ ప్రభాకర వరద! (6)

      మూడు కన్నుల దేవర!
ముజ్జగముల ఏలిక!
       కావు కావు మయ్య! మమ్ము!
 ఓ సుధాకర వరద!.(7)
    
      అమృత కిరాణాలతో
వే వెన్నెలల సాంబయ్య!
     కావు కావు మయ్య! మమ్ము!
ఓ సుధాకర వరద! (8)
             
👌"కావు కావు!" కావనగ
"కాపాడు"మని భావము!
      "కాకి కూత"ల మర్మము!
  ఓ శంకర ప్రియులార!

కామెంట్‌లు