'జీవితం-ఏడు చేపల కథ' ;- .డా.భోజన్నగారి అనసూయ.నిజామాబాద్.99898 22494
 కథలు జీవితాల జనితాలు
ప్రశ్నల భయాలు
జవాబుల చిట్కాలు
రాకుమారులైనా వేటకు పోవుడే
చేపలు తెచ్చుడే, ఎండబెట్టుడే
ఎండుచేపలు భవితకి మదుపు 
                
గడ్డిమోపు అడ్డము లాంటివి తట్టుకోవాలి
ఆవుల పోషణ ఆకలి తీర్చు
కంటికి రెప్పల్లా కాపాడే ఇంటిపెద్ద
గోవుల కాచే గోపాలుడే
అవ్వ బువ్వ పెట్టకుంటే ఆలోచన సున్నా
పిల్లవాడిని ఏడిపియ్యకుండా
అమ్మలంతా సవ్యసాచులు కాకుంటే
పిల్లలు చీమలపుట్టలో వేలు పెట్టుడూ, అవి కుట్టుడూ
ఏడు చేపలముచ్చట ఏడు తరాలకి సరిపడా
దన్నునిచ్చిందీ, పిల్లలకి రోజూ కమ్మటి నిద్రనిచ్చింది.

కామెంట్‌లు