పద్నాలుగు భాషలు మాట్లాడి
ప్రధాని అయిన పీవీ నరసింహారావు
మన తెలుగువాడు!!
తెలుగు హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా
మాట్లాడిన ఆరేటర్ భారత ఉపరాష్ట్రపతి
ఎం వెంకయ్య నాయుడు
మన తెలుగువాడు!!
తెలుగు భాషను
తెలుగుదేశం గా మార్చిన
ఎన్టీఆర్ మన తెలుగువాడు!!!
తెలంగాణ యాసను తెలంగాణ భాషను
ప్రపంచానికి పరిచయం చేసిన
కెసిఆర్ మన తెలుగువాడు!!!
పాటను పంటగా మార్చి
తెలంగాణ కడుపు నింపిన
తెలంగాణ ఉద్యమ పాట శంఖారావం
ఎమ్మెల్సీ మన దేశపతి
మన తెలుగువాడు ఒక ఉపాధ్యాయుడు!!
ఆకాశాన్ని ఒడిని చేసి
చంద్రుని పాలమీగడల వెన్నెలను చేసి
భూమికి దించి
పసి పాప ఏడుపు మాన్పించిన
అమ్మ పాట దేశపతి దీ!!!
మేఘాలన్నీ వాకిట్లో వడగళ్ల
పూలు రాల్చినట్లు
గడపగడప గొంతు తడిపిన
దేశపతి పాట
పల్లె పల్లె మళ్లీ మళ్లీ వినే
ఒక తెలంగాణ పోరాట పాట
అతనిది!!?
ఒళ్ళు జలదరించి
రోమాలు నిక్కబడుచుకునే
దేశపతి పాట
చల్లని కన్నీళ్లతో
స్నానం చేసినట్లు ఉంటుంది!!?
గుండె గుండెను గుద్దినట్లు
కళ్ళు కళ్ళను చూసి ఉరిమినట్లు
మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు
తుపాను యుద్ధాల్లా
ఆతని కదిలే పెదాల శబ్దాలు!!
ఏడు గుర్రాల రథసారథి
ఏడు రంగుల కిరణాల ప్రతినిధి
అతడే ఆదిత్యుడు
అతడే మన ముఖ్య అతిథి
అతడే మన దేశపతి!!!!
దేశపతి గొంతే ఒక భగవంతుడు!!
ఎమ్మెల్సీ దేశపతి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా రాసిన కవిత.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి