నోటితో జాగ్రత్త!!- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
మనసుకు గాయమైతే
కోలుకొనుట బహు కష్టం
వాటిల్లు  ఖచ్చితంగా
బ్రతుకున తీరని నష్టం

 మాటలనే  కత్తులతో 
హృదయాలను గుచ్ఛరాదు
తీవ్రమైన చూపులతో
మనశ్శాంతి దోచరాదు

మరల మరల వెటకారం
ఏమాత్రం వద్దు వద్దు
చేతనైన  సహకారం
అందిస్తే ముద్దు ముద్దు

అన్నింటికి ఆధారం
నోటి మాటలే మరువకు
ప్రశాంతత కావాలన్న
ఎప్పుడూ నోటిని జారకు


కామెంట్‌లు