ఇహం శాశ్వతం అనే నమ్మకం
అహం కప్పేసిన అజ్ఞానం..
విషయాల పట్ల విపరీత మోహం
వివరం తెలియని వ్యామోహం
కళ్ళ ముందు జరిగే మార్పులను
చూస్తూ కూడా ....
నేను మాత్రం క్షేమం అనుకుని
అణువంత కూడా మారని బుద్ధి
వెలుపల లోపల అంతా
నిండిన చైతన్యం.....తానే
చేరుకోవలసిన గమ్యం
ఎరుక కలిగి వుండాల్సింది నేనే!
నాతోనే ఉంటూ నాకు
అనిపించని కనిపించని
నిత్యమూ....సత్యమూ
అయిన చిదానంద తత్వం
నీ తేజోమయమైన
అఖండజ్యోతి స్వరూపం రోజూ
కన్నులముందు సాక్షాత్కరిస్తున్నా..
తెలుసుకోలేని మాయ
తమస్సు నుండీ వెలుగు దారిలోకి
నన్ను చేయిపట్థి నడిపించే
ఆపద్భాందవ ఆప్తమిత్రుని
ఆగమన సమయాన నమస్కరిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి