దయాగుణం;- సి.హెచ్.ప్రతాప్
 దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధ తో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు.
దయాగుణం అన్ని గుణాల లోకెల్లా అత్యుత్తమమైనది. ఈ సర్వోన్నత గుణం కలిగిన మానవులు మహనీయులౌతారని పలు శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఉపకారం చేయడం అంటే, ఎదుటి వారికి సాయం అందిస్తున్నాం అన్నది మాత్రమే కాదు, దాని వల్ల మనలో సానుకూల భావనలు పెరగడం ద్వారా మనకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. దయాగుణం లేనివారు ఇతరుల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఎవరెలా పోతే మాకేంటని అనుకుంటారు.వారికి జీవితంలో కలిగే మంచి తాత్కాలికం మరియు అతి స్వల్పం. ఎదుటి వారిపట్ల దయాగుణాన్ని చూపించడం చాలా సులువని పలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంటున్నారు. పాఠశాల, కార్యాలయం, ఇలా ఎక్కడైనా సరే ఎదుటి వారిపట్ల కరుణ చూపండి, ఉపకారం చేసేందుకు ప్రయత్నించండి. అది మీతో పాటు మీ నుంచి సాయం పొందేవారి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది అని వారు సలహా ఇస్తున్నారు.
లేనివాడికి తగిన రీతిలో మనకున్నది కొంతలో కొంత ఇచ్చి సహాయపడడదే దయాగుణము . కస్టములో ఉన్నవారికి కొన్ని మంచి ఓదార్పు మాటలు ఎంతో ఊరటనిస్తాయి . ప్రపంచీకరణ ప్రజల్ను దగ్గరికి తెచ్చంది . అన్నింటా ఓ తోడు , మన పక్క నున్నవారు అవసరం వస్తే సాయపడరారన్న చిన్ని ఆశ చాలు బ్రతుకు తెరువు లో ఎంతోభారము తగ్గిపోతుంది . చిన్ని చిన్ని అవసరాలు , చిన్నపాటి మాటతో లభించే సాంత్వన చాలు ఎదుటివారికి , మనకు సంతృప్తిని , శాంతిని కలిగిస్తుంది.

కామెంట్‌లు