తెలుగు జాతీయం.;-తాటి కోల పద్మావతి

 కను సన్నలలో మెలగు.
అభిప్రాయమును బట్టి నడుచుకొను...
కను సైగలు అంటే కను సన్నలు-ఈ సైగలనేవి సంజ్ఞా రూపంలో ఉన్న అభిప్రాయాలు. పసిపిల్లలు, తల్లిదండ్రుల కను సన్నలలో విద్యార్థులు ఉపాధ్యాయుల కను సన్నలలోనూ, స్నేహితులు హితుల కను సన్నలలో మెలుగుతుంటారు.
భారత యుద్ధ చివరి ఘట్టంలో భీమ దుర్యోధనుల గదా యుద్ధము జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని కను సన్నలతో దుర్యోధనుని ఊరు భంగం చేస్తాడు. దానితో మహాభారత యుద్ధము ముగుస్తుంది.
ఈ ప్రపంచంలో నిష్తంత్ర సమాచారము కను సైగలతోనే కార్యము సాధించేవారు ఉన్నారు.

కామెంట్‌లు