సుమిత్ర మిత్రా! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో ఆడపిల్లలు రివిజన్ ప్రశ్నలకు శ్రద్ధగా జవాబు చెప్తోంటే అబ్బాయిలు దిక్కులు చూస్తున్నారు. వారిని  ఏమైనా అనాలంటే ఆకొత్త టీచర్ కి భయం!నైన్త్ అయిపోయి టెన్త్ క్లాస్ పాఠాలు మొదలు పెట్టారు బడిలో. మిగతా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి. "పిల్లలూ!జి.కె.అడుగుతాను.జవాబు చెప్పండి " ఓ అన్నారు అంతా ఉషారుగా!"యూరోపియన్  ఇన్వెంటర్ అవార్డు 2021లో గెల్చుకున్న  ఇండియన్ అమెరికన్ సైంటిస్టు ఎవరు?" విజయ వెంటనే అంది"టీచర్! ఆమె సుమిత్ర మిత్రా!యూరప్ లో చాలా ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ ప్రైజ్ అది.డెంటిస్ట్రీలో నానో టెక్నాలజీని ఉపయోగించి చేసిన ఆమె ప్రయోగానికి ఆబహుమతి లభించింది టీచర్!" ఇదే ప్రపంచంలో తొలి సారి నానో పార్టికల్స్ ద్వారా నోటి దంతాల్నిఎక్కువ బలంగా చేసే టెక్నిక్. ఆమె ప్రయోగంతో ప్రపంచంలో కోటిమంది పైగా లాభపడ్డారు.నోటి సమస్యలున్నా హాయిగా నోరారా నవ్వుకోవచ్చు ""శభాష్!ఇప్పుడు మీరు ఇలాంటి విషయాలు తెలుసుకుని కొత్త ప్రయోగాలు చేయాలి. మార్కులు కన్నా విజ్ఞానం కొత్తవి తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఆసక్తి ఉండాలి. " అలాగే టీచర్ అన్నారు పిల్లలు అంతా 🌺
కామెంట్‌లు