చిట్టి పొట్టి పిల్లలం; శ్రీ రేఖ , కెనడా
చిట్టి పొట్టి పిల్లలం
చిన్ని చిన్ని పాపలం
చక చక మంటూ అడుగులు వేస్తూ 
చాచా నెహ్రు కలలన్నీ పండిస్తాం

బుడ బుడ బుడ బుడ బుడగలు వేస్తూ 
వర్షపు నీటిలో మొగ్గలు వేస్తాం
చిన్ని పొన్ని ముద్దు మాటలతో 
అందరి మన్నన పొందుతు ఉంటాం

పిన్నల పెద్దల ఆదరణతో 
నేటి నేటికీ ముందంజ వేస్తాం
పిల్లలు కాదు పిడుగులన్నట్లు
ప్రతీ పనిలోనూ పరిణతి చూపుతాం


కుల మత బేధం కానక మేము
అందరికీ చేయూత నిస్తాం
కలసి మెలసి కరుణను జూపుతూ
కలిమికై కలకాలం కష్టపడతాం

భారతదేశపు భవిత కోసం
భావితరాలకు నాందిని పలుకుతాం
భవితను నిలిపిన బంగరు భూమిని
భాగ్య సీమగా మారుస్తాం


కామెంట్‌లు