*హనుమాన్ చాలీసా - చౌపాయి 14*
 *సనకాదిక బ్రహ్మాది మునీశా!*
*నారద శారద సహిత అహీశా!!*
తా: హనుమంతా! సనకాది మునులు, బ్రహ్మాది దేవతలు అందరూ, నారదుడు, సరస్వతీ దేవి తోబాటు హింసను ఒప్పుకోని వారు అందరూ కూడా నిన్ను ఎంతో పొగుడుతున్నారు......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం:  మనం సమాజానికి పనికి వచ్చే మంచి పని చేసినప్పుడు, మంచిని ప్రోత్సహించేవారు అందరూ కూడా చేయబడ్డ ఆ పనిని, ఆ పని చేసిన వారిని ముక్త కంఠం తో పొగుడుతారు. ఎలా అంటే, నారసింహ అవతారంలో హిరణ్యకశిపుని, విష్ణువు సంహరించినప్పుడు, ముల్లోకాలలో కూడా పండుగ వాతావరణం ఏర్పడి, ఆ నారసిహ స్వామిని దేవాదులు, ఋషులు, మునులు మానవులు కూడా కీర్తించారు. కనుక, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించే సదవకాశాన్ని మనకు అందరికీ ఇవ్వమని ........కంజదళాయతాక్షి మనోహరుడు అయిన రామచంద్రమూర్తిని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు