*హనుమాన్ చాలీసా - చౌపాయి 15*
 *యమ కుబేర దిగపాల జహాఁ తే!*
*కవి  కోవిద  కహి  సకే   కహాఁ  తే!!*
తా: హనుమంతా! యముడు, కుబేరుడు, తొమ్మిది దిక్కులకు అధిపతులైన దేవతలు, కూడా నీ మహిమను తెలుసుకోలేక పోతున్నారు. అటువంటప్పుడు, పండితులు, కవులు నిన్న ఏవిధంగా పొగడగలుగుతారు. నీ శక్తిని ఎలా తెలుసుకో గలుగుతారు.......అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం:  సముద్రలంఘన చేసి, రావణ బ్రహ్మ యొక్క అయిదుగురు మంత్రులను అవలీలగా తుదముట్టించిన, భీమాగ్రజా, నీ శక్తిని తెలుసుకోవడం దేవదేవులకు, దిక్పాలురకు, సాధ్యం కాలేదు. నీ శక్తి నీకే తెలియదు అని లోక ప్రతీతి. రామచంద్రమూర్తి మాత్రమే తెలుసుకో గలిగారు. ఆయన పరామాత్ముడు కనుక. అలాగే, మనలో ఉన్న శక్తిని గురించి, పైకి తీసుకు రాగలిగేది కూడా మన పై అధికారులే. ఇలాంటి శక్తిని గుర్తించి ప్రోత్సాహం అందించే మంచి అధికారులు, స్నేహితులు, హితులు మన అందరికీ లంభిచాలని, అలా........కంజదళాయతాక్షి మనోహరుడు అయిన రామచంద్రమూర్తిని వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు