దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (26) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కడప జిల్లాలోనే సంబేపల్లి గ్రామ ప్రాంతపు రహదారి జనం తండోపతంలాలుగా వలస పోతున్నారు  వారి చేతుల్లో గాని తలపై కానీ ఎటువంటి వస్తువులు లేవు  చిన్నపాటి వస్తువు మోసేందుకు కూడా వారికి శక్తి చాలడం లేదు ఎంత వీలైతే అంత తొందరగా కడపకు చేరాలని తాపత్రయం  ఆ తాపత్రయానికి కారణం కడపలో ఏర్పాటు చేసిన గంజి కేంద్రాల్లోని గంజి త్రాగి తమ ప్రాణాలు నిలుపుకోవాలని  రోజుల తరబడి ఆహారం లేక చిక్కి సెల్యమైన వారి శరీరాలు అస్తిపంజరాలకు చర్మాన్ని తొడిగినట్టుగా ఉంది  వారి యాత్ర కొన ఊపిరితో సాగుతున్న మహాయాత్రలా ఉంది కొద్దిపాటి చేవ ఉన్నవాడు త్వరగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నారు.
చేవ చచ్చిన ముసలి వాళ్లు ఒక్కో అడుగు భారంగా వేస్తూ ప్రయాణం  సాగిస్తున్నారు. కొద్దిసేపు గడిచాక నడక వల్ల కలిగిన అదుపు తీర్చుకుందాం అని ఆగారు ఇద్దరు యువకులు  వారితో పాటు ఓ పదేళ్ల కుర్రాడు కూడా వాడు ఎక్కడి వాడో వారికి తెలియదు వారు ఎవరో ఒకరు వారికి తెలియదు వారు బాటసారి మాత్రమే  రహదారి ప్రక్కనే ఉన్న బండరాయిడ చేరువకు వెళ్లి కూర్చున్నారు  వారం రోజులు ఆకలి ఆ ఇద్దరు యువకులను దహించి వేస్తూ ఉండి కనీసం దాహం తీర్చుకోడానికి కూడా అవకాశం లేదు వారికి  అయినా ఆశ చావక చుట్టు ప్రక్కల దృష్టిసాదించారు  బీటలు వారిన భూములు మొడు వారిన  చెట్లు కనిపించాయే తప్ప కనీసం ఎండమావి లాంటిది సైతం వారి దృష్టికి రాలేదు. బండ రాతి మీద కూర్చున్న  వేడి గాలి ఎదురుగాలి వారిని స్ప్రుసించడం ఆపలేదు. కడప ఇంకా 5 పరుగులు ఉంటుంది పొద్దుగుకే వేళ్ళకు వెళ్ళగలమా  అంటే వెళ్ళలేము అని సమాధానం  మరి ఎట్టా అనుకుంటే చేసేదేముంది ప్రాణాలు వదలాల్సిందే  ఏం కర్మ చేసామో ఇలాంటి కరువులో ఇరుక్కున్నావ్ భారంగా నిటుర్చారు.  నాకు చాలా ఆకలిగా ఉంది  నాకు ఆకలవుతుంది అనుకున్నారు  ఏరా నీకు కుర్రాన్ని ఉద్దేశించి అడిగాడు మొదటి యువకుడు  ఆకలవుతుంది అన్నట్లుగా తల ఊపాడు  చుట్టుపక్కల కాయ కసరు కూడా లేదు ఆకలి అగ్గిగా మండుతోంది ఏమి తిని ఈ అగ్గి చలర్చుకోవాలో తెలియట్లేదు అంటూ వాపోయాడు  అలా కొద్దిసేపు ఆకలి గురించి ఏ కరువుపెట్టు కున్నాక మొదటి యువకుడి దృష్టి ఆ కుర్రవాడిపై పడింది  అతని మస్తిష్కంలో తడుక్కున ఓ భయంకరమైన ఆలోచన తన సహచరుని దగ్గరికి పిలిచి చెవిలో చెప్పాడు.


కామెంట్‌లు