సీతాన్వేషణలో రామలక్ష్మణులు వెతుకుతూ ముందుకు వెళుతున్న దృశ్యాన్ని చూసిన సుగ్రీవుడు తన పరివారంతో బయలుదేరి పరిగెట్టడం మొదలు పెట్టాడు అప్పటివరకు హనుమ ప్రస్తావన రామాయణంలో కనిపించదు. సేవకుని లక్షణాలను గురించి మొదట ఆయన చెప్పినది మాటలలో కాక చేతలలో స్వామీ ఎందుకు భయపడుతున్నారు అంటే అన్న ఇద్దరిని పంపిస్తున్నాడు మనందరినీ చంపమని అందువల్ల భయపడి పారిపోతున్నాం అని చెప్పడంతో తనకు వచ్చిన నవ్వును ఆపుకొని వారు ఎవరో తెలుసుకొని వస్తాను అప్పటివరకు ధైర్యంగా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాడు మాటల ప్రస్తావన ఎలా ఉండాలో వాల్మీకి మనకు తెలియజేయడం రామాయణ రహస్యం. కొత్తవారిని పరిచయం చేసుకోవడం కోసం ముందు తన ప్రవర తెలియజేసి వారి గురించి అడగాలి ఈ ధర్మాన్ని ప్రసార శాఖ గాఢంగా నమ్మి దానిని అమలుపరిచింది కూడా ఎదుటివారితో మాట్లాడడానికి హలో అని తన గురించి చెప్పి ఎదుటివారిని గురించి మాట్లాడాలి ఇది ధర్మం ధర్మం తెలిసిన హనుమాన్ స్వామీ మీరు ఎవరు ఏ పని మీద ఇటు వచ్చారు మీకు నేను ఏమైనా సహాయం చేయాలా అని అడగగానే శ్రీరామచంద్రమూర్తి తనకు సమాధానం చెప్పకుండా తమ్ముడు లక్ష్మణుని వైపు తిరగడం చూసి గ్రహించిన హనుమ వెంటనే స్వామీ నేను సుగ్రీవుని బంటునీ అంజనీ దేవి కుమారిడిని మీకు ఈ అడవి కొత్త మీకు ఏ సహాయం కావలసి వచ్చినా నేను చేస్తాను నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు కూడా రాముల వారు సమాధానం చెప్పలేదు వీరు ప్రథమ శ్రేణి హనుమ నాలుగవ స్థానం కనుక లక్ష్మణ స్వామి వైపుకి తమ్ముడూ మాట్లాడడం అన్న విద్య నీకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే ఇతని వెంట వెళ్ళు అనడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అతను మాట్లాడిన ఒకే ఒక మాటలో అతని సంస్కార విధమైన ప్రవర్తన మాట తీరు అర్థం చేసుకున్న వాడు కనుకనే ప్రపంచానికే ఆదర్శ పురుషుడు కాగలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి అని ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వాల్మీకి మహర్షి రాముని నోటిగుండా ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని ఏడు పద్ధతులుగా విభజించి చెప్పడం రామాయణంలో మనం చూస్తామని జీవిత పరమార్ధాన్ని నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పినదే గనక అదే రామాయణంగా దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందింది అందుకు దేశం మొత్తం వాల్మీకి మహర్షికి రుణపడి ఉంది.
ఎలా మాట్లాడాలి;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి