కాలాన్ని నిద్రపోనివ్వను అన్నారు
ఓ మనిషి కవి,ఆత్మగల మహాకవి నిజమే మరి
కాలం నాతో నడుస్తుంది
నా నడకే కాలం కొలతై వీస్తుంది
కాలం
సూర్య భ్రమణంలోనో
మనిషి నీడల గతిలోనే
గడియారం ముళ్ళ కదలికల్లోనో ఉందనుకుంటాం
కానీ,కాలం నాతో వెన్నంటి కదిలేది
మనిషి వెంటేసుకు తిరిగిన కాలముద్రలు
ప్రతి అడుగులో ప్రతి మాటలోనూ
ఆత్మీయంగానో,ఆజ్ఞాపిస్తూనో
కలిసి నడిచిన గుర్తుల్లో వినిపించు
కాలం
కొందరికి క్రమశిక్షణ గురువు
మరి కొందరికి
అనుభవం రంగరించిన జీవితం
క్షణ క్షణం తనతో నడిచి
తనలో కణ కణం నడిపించిన శక్తి
అణువణువూ విస్తరించి వ్యాపించిన నా పరుగు నేస్తం
కాలాన్ని జయించడం ఒక టెస్టే
జీవికీ
కాలాన్ని నడిపించడం పెద్ద టాస్కే
మనిషికెప్పుడూ
నాతో కలిసి నడిస్తున్న కాలం
సుఖదుఃఖాల సంగమం
అవును కాలం నేనూ
పరస్పరం ఆప్యాయంగా
పలుకరించుకొనే జీవన భాష
తరాల అంతరంగాల గుండె చప్పుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి