నటనకే వన్నె తెచ్చిన నందమూరి;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-9963265762
 అతడు ఆంధ్రుల ఆరాధ్యదైవం
రాముడైన, కృష్ణుడైన మనకు ఆయన  గోచరించేది ఆతని రూపమే
రావణబ్రహ్మా గా సీతారాముల కల్యాణం 
భూకైలాస్
కురువంశ పితామహుడు భీష్మునిగా భీష్మలో
నర్తనశాల లో  నాట్యాచారుని పాత్రలో  బృహన్నల గా
ఆయన నటన " నభూతో నభవిష్యతి"
నేటికి లవకుశలో సీతారాముల జంటగా
ఎన్.టి ఆర్. అంజలి చేసిననటన   మరెవ్వరు చేయలేరన్నది జగమెరిగిన సత్యం.
పాతాళ భైరవి లో తోటరాముడిగా.
దేవత సినిమాలో భార్య మరణించినదని తెలిసి 
ఘంటసాల స్వరంలో 
"బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది న్యాయమా" అన్న పాటకి ఆయన చేసిన నటనచూసి
కన్నీరు కార్చని వారుండరు
రక్తసంభంధం లో అన్నగా చెల్లిపై చూపిన ఆత్మీయ,అనురాగ బంధం
మరువలేనిది మరపురానిది
కన్యాశుల్కం లో గిరీశంగా
ఆత్మబంధువు ,కలసిఉంటే కలదు సుఖం చిత్రాలలో చదువురాని వాడైన సంస్కార వంతుడిగా
జస్టిస్ చౌదరి,కొండవీటి సింహం చిత్రాలలో న్యాయదేవతకు ప్రతీకగా ,ఉమ్మడి కుటుంబం ,అడవిరాముడు
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ఆయన నిబద్ధత, సమయపాలన, గౌరవం నేటికీ మరువలేని మహనీయులు 
భారతప్రభుత్వంచే పద్మశ్రీ అందుకున్న నందమూరి తారక రామారావు గారు
మీరు నటనకే వన్నె తెచ్చిన
మహనీయులు
మీ శతజయంతి సందర్భంగా శతకోటి వందనములు....!!
........................
.

కామెంట్‌లు