33)
కామభావనలకు కలికిని జూపుచు
దేశపరువుకొరకు దేవులాట
నట్టి ప్రకటనలకు నతివెట్లు ముందుండు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
34)
అంగములను జూపి యాకర్షణముజేయ
ధనపిశాచులకును ధర్మమగునె
యింటియాడువారి నిట్లుజూపింతురా
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
35)
యువతవిద్యవృద్ధి యుక్తమౌ వయసునన్
మాదకములవాడి మహిని చెడిరి
మద్యపానమందు మరియొడల్ గుల్లయే
వనజమాట మిగుల వాస్తవమ్ము!
36)
మాటలెన్నిజెప్ప మారని మూడులన్
దూరముంచుటేమి దోషమవదు
నిత్యవాదులాట నెవరు సహింతురే
వనజ మాట మిగులవాస్తవమ్ము !
కామభావనలకు కలికిని జూపుచు
దేశపరువుకొరకు దేవులాట
నట్టి ప్రకటనలకు నతివెట్లు ముందుండు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
34)
అంగములను జూపి యాకర్షణముజేయ
ధనపిశాచులకును ధర్మమగునె
యింటియాడువారి నిట్లుజూపింతురా
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
35)
యువతవిద్యవృద్ధి యుక్తమౌ వయసునన్
మాదకములవాడి మహిని చెడిరి
మద్యపానమందు మరియొడల్ గుల్లయే
వనజమాట మిగుల వాస్తవమ్ము!
36)
మాటలెన్నిజెప్ప మారని మూడులన్
దూరముంచుటేమి దోషమవదు
నిత్యవాదులాట నెవరు సహింతురే
వనజ మాట మిగులవాస్తవమ్ము !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి