గొప్పవరం... !( చిత్ర కవిత )- కోరాడ నరసింహా రావు.
హృదయానికి హత్తుకునే 
  తల్లిప్రేమకు సాటి లేదు ... !
 కౌగిలిలో ఒదిగిపోయి... 
. బిడ్డ అనుభవించు ఆ హాయిని..., 
    వర్ణించగ భాష కలదా... !?
జగము మరచి నిశ్చింతగ... 
.  హాయినొందు బిడ్డలదే అదృష్టము... ఎంచి చూడ !!

మాతృహృదయ మాధుర్యం అనుభవించు అవకాశం... సమృద్ధిగ పొందగలుగు... 
  బిడ్డలదే  భాగ్యము కద... !

తల్లీ, బిడ్డల బంధం... 
  జగతిలోనె  అపూర్వం !
  ప్రతి ప్రాణికి ఆ దైవం... 
    ప్రసాదించు గొప్ప వరం !!
       *******

కామెంట్‌లు