నాగరికతారూపంకోసం జరిగిన పరిణామాలన్నీ వీరి శ్రమశక్తి వల్లనే కదా.
శాస్త్రీయధృక్పథాన్ని మనందరికీ నేర్పినది వీరి పరిశోధనలవల్లనే కదా. నూత్నావిష్కరణలకు ఆది వీరే కదా.
మన సుఖాలకు మూలకారణాలు వీరే కదా. కూడు గూడు గుడ్డ ల తయారీ వీరిదే కదా. పాతరాతియుగం నుండి నేటి మన ప్రస్థానానికి నారుపోసి నీరుపెట్టింది వీరే కదా. సుఖాలన్నీ మనకు ధారపోసి కష్టాలన్నీ సహిస్తూ ఇంకా తండాల్లోనే మగ్గిపోతున్నది వీరే కదా. బతుకు నేర్పినవారే నేడు బతుకుకోసం పోరాటం చేస్తున్నరు. పోడుభూమిని సాగుచేస్తూ ఎవరిమీదా ఆధారపడక స్వీయకష్టంతో తండాల్లో తండ్లాడే సోదరులు
ప్రతిఒక్కరు ఒక అల్లూరి గా, ఒక కొమురం భీం గా మారాల్సిందే.
గెలుపు పిలుపుకోసం పోరాటం చేయాల్సిందే. గిరిజన తండాల అస్తిత్వం కోసం నిరంతరం తండ్లాడవలసిందే!!!
+++++++++++++++++++++++++
తండాల్లో-తండ్లాట(చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి