సుప్రభాత కవిత ; - బృంద
కనుచూపు మేరా పచ్చదనం
కనువిందు చేసే కమనీయ దృశ్యం 

పచ్చనాకుల మధ్యలో
వెచ్చగా రేకు విప్పిన
ఆకుపచ్చని గులాబీలా....

పుడమి పాపిట అమరిన
పుత్తడి పాపిడి గొలుసులా
పచ్చని పైరును విడదీసే దారిలా...

నడచి వెళ్ళు అడుగులకు
మడుగులొత్తు పచ్చికల
సుతిమెత్తని స్పర్శలా

కడుపునింపు పంటనిచ్చు
కనులపంట చేనుసిరి
ఒలికిస్తున్న కళల మిసమిసలా..

కళ కళ లాడే జగతికి
చైతన్యమూ జీవమూ
పోసి..అందరినీ తండ్రిలా
కాచి రక్షించే కరుణానిధి

దినకరుడికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు